Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...

శ్రీ దిలీప్ సంఘాని (చైర్మన్)

IFFCO చైర్మన్‌గా శ్రీ దిలీప్ సంఘాని వ్యవహరిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా భారతీయ సహకార ఉద్యమాన్ని పరిపుష్టం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ సంఘాని ప్రస్తుతం NAFED,NCUI మరియు GUJCOMASOL వంటి పలు రాష్ట్రీయ, జాతీయ స్థాయి సహకార సంఘాల్లో కీలక హోదాల్లో ఉన్నారు. 1991-2004 మధ్య లోక్‌సభలో అమ్రేలీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అమ్రేలీ ఎమ్మెల్యేగా సేవలు అందించడంతో పాటు గుజరాత్‌లో వ్యవసాయం, సహకారం, పశు సంవర్ధక శాఖ వంటి కీలకమైన వివిధ శాఖలకు సారథ్యం వహించారు. రైతులకు ప్రయోజనకరమైన IFFCO విధానాల రూపకల్పనలో కూడా శ్రీ సంఘాని కీలకపాత్ర పోషిస్తున్నారు.

డా .యు.ఎస్. (మేనేజింగ్ డైరెక్టర్ &సీఈవో)

ప్రతిష్టాత్మక బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరు పట్టా పొందారు. అంతర్జాతీయ కెమికల్ ఫెర్టిలైజర్ల విభాగంలో Dr.అవస్థి ఎంతగానో పేరొందిన నిపుణులు, సాధికారత కలిగిన వారు. అయిదు దశాబ్దాల అనుభవం గల Dr. అవస్థి, ఎరువుల ఉత్పత్తిలో IFFCOను అంతర్జాతీయంగా అగ్రగామిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సారథ్యంలో IFFCO అన్ని విభాగాల్లోనూ వేగంగా పురోగమించడంతో పాటు సాధారణ బీమా, గ్రామీణ టెలిఫోనీ, గ్రామీణ రిటైల్, సెజ్‌లు మొదలైన వివిధ విభాగాల్లోకి కూడా విస్తరించింది. IFFCOతో పాటు పలు భారతీయ, అంతర్జాతీయ కంపెనీల బోర్డుల్లో కూడా Dr. అవస్థి సభ్యునిగా సేవలు అందిస్తున్నారు.

Balvir Singh
శ్రీ బల్‌వీర్ సింగ్ (వైస్ చైర్మన్)

డైరెక్టర్

ఆదర్శ్ కృషి విప్రణ్ సహకారి సమితి లిమిటెడ్

చిరునామా: జెవాన్, తాలుకా: పువయాన్, షాజహాన్‌పూర్, ఉత్తర్ ప్రదేశ్ – 242401

మరింత చదవండి
Prem Chandra Munshi
శ్రీ ప్రేమ్ చంద్ర మున్షి

డైరెక్టర్

ఆదర్శ్ కృషక్ సేవా స్వావలంబి సహకారి సమితి లిమిటెడ్.

చిరునామా: భవంటోలా గ్రామం, ఖవాస్‌పూర్, BL బహుహారా,ఆరా సదర్, జిల్లా – భోజ్‌పూర్, బీహార్ – 802157.

మరింత చదవండి
Prahlad Singh
శ్రీ ప్రహ్లాద్ సింగ్

డైరెక్టర్

ది గిల్లన్ ఖేరా ఫ్రూట్/వెజిటేబుల్స్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ సహకార సమితి లిమిటెడ్

చిరునామా: గిల్లన్ ఖేరా గ్రామం & PO, జిల్లా –ఫతేహబాద్, హర్యానా.

మరింత చదవండి
MR. SIMACHAL PADHY
శ్రీ సీమాచల్ పధి

డైరెక్టర్

శ్రీ కపిలేశ్వర్ MPCS లిమిటెడ్

చిరునామా: ఆర్ కే స్ట్రీట్, రాధా కాంత స్ట్రీట్, At & PO: పురుషోత్తంపూర్, గంజాం – 761018 (ఒరిస్సా)

మరింత చదవండి
srinivasa-gowda
శ్రీ కె. శ్రీనివాస గౌడ

డైరెక్టర్

ది కుదువనహళ్లి కన్జూమర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్

చిరునామా: కుదువనహళ్లి, PO. S.B. హళ్లి, తాలుకా: కోలార్, జిల్లా: కోలార్ – 563101 (కర్ణాటక)

మరింత చదవండి
Balmiki Tripathi
శ్రీ బాల్మీకి త్రిపాఠి

డైరెక్టర్

PCF (ప్రదేశిక్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్)

చిరునామా: 32, స్టేషన్ రోడ్, లక్నో, ఉత్తర ప్రదేశ్

మరింత చదవండి
MS. SADHANA LAXMANRAO JADHAV
కుమారి. సాధనా లక్ష్మణ్‌రావ్ జాదవ్

డైరెక్టర్

కృషిసాధన మహిళా షెట్మల్ ఉత్పాదక్ ఖరీదీ విక్రి V. ప్రక్రియ సహకార్ సంస్థ ఎంవైడిటి

చిరునామా: వించూర్, టీకే, నిఫాడ్, జిల్లా: నాసిక్, మహారాష్ట్ర - 422305

మరింత చదవండి
P P Nagi Reddy
శ్రీ పి. పి. నాగి రెడ్డి

డైరెక్టర్

ఎ.పి స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్.

చిరునామా: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్. D. నం. 55-17-2, 5వ అంతస్తు, స్టాలిన్ కార్పొరేట్, CGO కాంప్లెక్స్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ దగ్గర, ఆటో నగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్- 520007

మరింత చదవండి
Amit Pratap Singh
శ్రీ అమిత్ ప్రతాప్ సింగ్

డైరెక్టర్

వైష్‌పురా (లహర్) సేవా షా. సంస్థ మర్యాదిద్

చిరునామా: భాత్‌పురా, తాలూకా: లహర్, జిల్లా: భిండ్, మధ్య ప్రదేశ్ –477445.

మరింత చదవండి
mn-rajendra-kumar
శ్రీ ఎం. ఎన్. రాజేంద్ర కుమార్

డైరెక్టర్

ది కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్

చిరునామా: నం. 8, కన్నింగ్‌హామ్ రోడ్, బెంగళూరు – 560 052 (కర్ణాటక)

మరింత చదవండి
Jayeshbhai
శ్రీ జయేష్‌భాయ్ వి. రాదాదియా

డైరెక్టర్

జామ్ కందోరానా తాల్ సహఖరీద్‌వేచన్‌సంఘ్ లిమిటెడ్

చిరునామా: జామ్ కందోరానా, జామ్ కందోరానా తాలూకా, జిల్లా – రాజ్‌కోట్, గుజరాత్ - 360405

మరింత చదవండి
Jagdeep Singh Nakai
శ్రీ జగ్‌దీప్ సింగ్ నకాయ్

డైరెక్టర్

పుంజ్‌రాజ్ ఆగ్రో మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, భటిండా, పంజాబ్

మరింత చదవండి
Manvendra Singh
శ్రీ జగ్‌దీప్ సింగ్ నకాయ్

డైరెక్టర్

పుంజ్‌రాజ్ ఆగ్రో మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, భటిండా, పంజాబ్

మరింత చదవండి
Vijay Shankar Rai
శ్రీ విజయ్ శంకర్ రాయ్

డైరెక్టర్

మరింత చదవండి
Bhavesh Radadiya
శ్రీ భవేష్ రాదాదియా

డైరెక్టర్

మరింత చదవండి
MR. RAKESH KAPUR
శ్రీ రాకేశ్‌ కపూర్

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్

శ్రీ రాకేశ్ కపూర్ IFFCOలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ IRS అధికారి అయిన శ్రీ కపూర్‌, ఢిల్లీ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీర్ పట్టా పొందారు. ఆయన 2005లో IFFCOలో జాయింట్ ఎండీ, సీఎఫ్‌వోగా చేరారు. IFFCOలో చేరడానికి ముందు ఆయన భారత ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో సీనియర్ హోదాల్లో సేవలు అందించారు. మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీ కపూర్, IFFCO అనుబంధ సంస్థలైన నెల్లూరులోని IFFCO కిసాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఐకేసెజ్), IFFCO కిసాన్ సంచార్ లిమిటెడ్ (ఐకేఎస్ఎల్) సహా పలు కంపెనీల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు.

మరింత చదవండి
RP Singh
శ్రీ ఆర్. పి. సింగ్

హెచ్ఆర్ & లీగల్ డైరెక్టర్

శ్రీ ఆర్.పి. సింగ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్‌గా (హెచ్ఆర్ & లీగల్) విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పాట్నా యూనివర్సిటీ నుంచి లేబర్ అండ్ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పట్టా, బీహార్ ప్రభుత్వం నుంచి సోషల్ సైన్సెస్‌లో పీజీ డిప్లొమా పట్టా పొందారు. హెచ్ఆర్ & ఐఆర్ విభాగంలో అపార అనుభవం ఉన్న శ్రీ సింగ్, 1996 నుంచి IFFCOలో సేవలు అందిస్తున్నారు. IFFCOలో సంస్థాగతంగా హెచ్ఆర్ విధానాల రూపకల్పనలోను, యూనియన్లతో దీర్ఘకాలిక సెటిల్మెంట్లను కుదర్చడంలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. న్యాయకోవిదులైన శ్రీ ఆర్.పి. సింగ్ IFFCO చేపట్టే కంపెనీల కొనుగోళ్లు, విలీన ప్రక్రియలకు సంబంధించి మదింపు ప్రక్రియలు, ఒప్పందాల అమల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. IFFCOతో పాటు ఎడెల్వీజ్-టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, PHD చాంబర్ ఆఫ్ కామర్స్, IFFCO-MC క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, IFFCO ఈ-బజార్ లిమిటెడ్, కిసాన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్, దుబాయ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మొదలైన సంస్థల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు.

మరింత చదవండి
MR. MANISH GUPTA
శ్రీ మనీష్ గుప్తా

డైరెక్టర్ (స్ట్రాటెజీ & జాయింట్ వెంచర్)

శ్రీ గుప్తా ప్రతిష్టాత్మకమైన ఐఐటీ (ఢిల్లీ), ఐఐఎం (కోల్‌కతా)లో విద్యాభ్యాసం చేశారు. IFFCOలో ఫుల్ టైమ్ డైరెక్టరుగా చేరడానికి ముందు భారత ప్రభుత్వంలో IRS అధికారిగాను, వివిధ ప్రభుత్వ సంస్థల్లో సీనియర్ హోదాల్లోనూ సేవలు అందించారు. IFFCO వివిధ రంగాల్లోకి విస్తరించడంలోనూ, పలు అనుబంధ సంస్థలను పునర్‌వ్యవస్థీకరించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. IFFCOతో పాటు IFFCOలోని పలు అనుబంధ, అసోసియేట్ కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు.

మరింత చదవండి
Yogendra Kumar
శ్రీ యోగేంద్ర కుమార్

మార్కెటింగ్ డైరెక్టర్

శ్రీ యోగేంద్ర కుమార్ IFFCO మార్కెటింగ్ డైరెక్టరు హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దేశీయంగా తయారైన/దిగుమతి చేసుకున్న ఎరువులను దాదాపు దేశవ్యాప్తంగా విస్తరించిన సహకార సంఘాల భారీ నెట్‌వర్క్ ద్వారా ప్లానింగ్ / పంపిణీ మరియు విక్రయ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. IFFCO ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. IFFCOతో పాటు IFFCO ఈబజార్ లిమిటెడ్, IFFDC, IFFCO-MC క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, CORDET మొదలైన వాటి బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు. విస్తృతంగా పర్యటించే శ్రీ కుమార్, వ్యవసాయంపై అనేక ఆర్టికల్స్ రాశారు. సహకార ఉద్యమ అభివృద్ధి మరియు భారతీయ రైతుల సామాజిక-ఆర్థిక పురోభివృద్ధికి ఆయన గట్టి మద్దతుదారు.

మరింత చదవండి
birinder-singh
శ్రీ బీరీందర్ సింగ్

డైరెక్టర్ (కార్పొరేట్ సర్వీసెస్)

శ్రీ బీరీందర్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని IFFCO కార్పొరేట్ ఆఫీసులో డైరెక్టరు (కార్పొరేట్ సర్వీసెస్) హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను గుర్తించడం, నెలకొల్పడం, ప్రాజెక్టు ముందస్తు కార్యకలాపాలను నిర్వహించడం, సామాజిక లాభదాయకతపై ఎరువుల విధాన ప్రభావాన్ని విశ్లేషించడం మరియు ఇతరత్రా కార్పొరేట్ సర్వీసులకు సంబంధించిన అంశాలను ఆయన పర్యవేక్షిస్తారు. కలోల్ మరియు ఇతర ప్రాంతాల్లో నానో ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. IFFCOలో గత నాలుగు దశాబ్దాల పైగా దేశీయంగా వివిధ ప్రాంతాల్లో మరియు విదేశాల్లో పలు కీలక అసైన్‌మెంట్లకు సారథ్యం వహిస్తున్నారు. ఆయన అపార అనుభవమున్న టెక్నోక్రాట్. ఎరువుల రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సెమినార్లలో ఆయన తరచూ వక్తగా పాల్గొంటూ ఉంటారు.

మరింత చదవండి
G K Gautam
శ్రీ జి. కె. గౌతమ్

డైరెక్టర్ (టెక్నికల్)

శ్రీ జి.కె. గౌతమ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ (టెక్నికల్) హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికన్నా ముందు ఆఁవ్లాలోని IFFCO అమోనియం-యూరియా ప్లాంటుకు ఆయన సారథ్యం వహించారు. రూర్కీలోని ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీర్ పట్టా పొందిన శ్రీ గౌతమ్ 1981లో IFFCO ఫూల్‌పూర్ యూనిట్‌లో చేరారు. ఫూల్‌పూర్ మరియు ఆఁవ్లాలోని IFFCO ప్లాంట్లలో వివిధ సీనియర్ హోదాల్లో ఆయన సేవలు అందించారు. అలగే ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ ఎస్ఏవోసీ (OMIFCO) ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ ఇంచార్జిగా కూడా ఆయన వ్యవహరించారు.

మరింత చదవండి
A K Gupta
శ్రీ ఎ.కె. గుప్తా

డైరెక్టర్ (ఐటీ సర్వీసులు)

శ్రీ ఎ.కె. గుప్తా IFFCO డైరెక్టరు (ఐటీ సర్వీసులు) హోదాలో ఉన్నారు. న్యూఢిల్లీలోని IFFCO కార్పొరేట్ కార్యాలయంలోని ఐటీ & ఈ-కామర్స్ విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. కురుక్షేత్రలోని ఎన్‌ఐటీలో ఆయన ఇంజినీరింగ్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దన్నుతో వ్యాపార ప్రక్రియలను ఆధునీకరించడం ద్వారా సంస్థ ఉత్పాదకత మరియు లాభదాయకతను మెరుగుపర్చడంలో శ్రీ గుప్తా కీలకపాత్ర పోషిస్తున్నారు. విస్తృతంగా పర్యటించే శ్రీ గుప్తా పలు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక ఐటీ సెమినార్లలో వక్తగా పాల్గొనడంతో పాటు IFFCO తరఫున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఐటీ పురస్కారాలు అందుకున్నారు.

మరింత చదవండి

డైరెక్టర్లు

US Awasthi
డా . యు.ఎస్ అవస్థి
మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

IFFCOలో 1993 నుంచి Dr. ఉదయ్ శంకర్ అవస్థి మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా విధులు నిర్వర్తిస్తున్నారు. IFFCO రోజువారీ కార్యకలాపాల బాధ్యతలు, నిర్వహణను ఆయన పర్యవేక్షిస్తారు.

మరింత చదవండి
Rakesh Kapur
శ్రీ రాకేశ్‌ కపూర్
జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్

శ్రీ రాకేశ్ కపూర్ IFFCOలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ IRS అధికారి అయిన శ్రీ కపూర్‌, ఢిల్లీ ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీర్ పట్టా పొందారు. ఆయన 2005లో IFFCOలో జాయింట్ ఎండీ, సీఎఫ్‌వోగా చేరారు. IFFCOలో చేరడానికి ముందు ఆయన భారత ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో సీనియర్ హోదాల్లో సేవలు అందించారు. మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన శ్రీ కపూర్, IFFCO అనుబంధ సంస్థలైన నెల్లూరులోని IFFCO కిసాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఐకేసెజ్), IFFCO కిసాన్ సంచార్ లిమిటెడ్ (ఐకేఎస్ఎల్) సహా పలు కంపెనీల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు.

మరింత చదవండి
RP Singh
శ్రీ ఆర్. పి. సింగ్
డైరెక్టర్ (హెచ్ఆర్ & లీగల్)

శ్రీ ఆర్.పి. సింగ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్‌గా (హెచ్ఆర్ & లీగల్) విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పాట్నా యూనివర్సిటీ నుంచి లేబర్ అండ్ సోషల్ వర్క్‌లో మాస్టర్స్ పట్టా, బీహార్ ప్రభుత్వం నుంచి సోషల్ సైన్సెస్‌లో పీజీ డిప్లొమా పట్టా పొందారు. హెచ్ఆర్ & ఐఆర్ విభాగంలో అపార అనుభవం ఉన్న శ్రీ సింగ్, 1996 నుంచి IFFCOలో సేవలు అందిస్తున్నారు. IFFCOలో సంస్థాగతంగా హెచ్ఆర్ విధానాల రూపకల్పనలోను, యూనియన్లతో దీర్ఘకాలిక సెటిల్మెంట్లను కుదర్చడంలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. న్యాయకోవిదులైన శ్రీ ఆర్.పి. సింగ్ IFFCO చేపట్టే కంపెనీల కొనుగోళ్లు, విలీన ప్రక్రియలకు సంబంధించి మదింపు ప్రక్రియలు, ఒప్పందాల అమల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. IFFCOతో పాటు ఎడెల్వీజ్-టోకియో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, PHD చాంబర్ ఆఫ్ కామర్స్, IFFCO-MC క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, IFFCO ఈ-బజార్ లిమిటెడ్, కిసాన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్, దుబాయ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ మొదలైన సంస్థల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు.

మరింత చదవండి
Manish Gupta
శ్రీ మనీష్ గుప్తా
డైరెక్టర్ (స్ట్రాటెజీ & జాయింట్ వెంచర్స్)

శ్రీ గుప్తా 2010 డిసెంబరులో IFFCOలో డైరెక్టర్ (స్ట్రాటెజీ & జాయింట్ వెంచర్స్)గా చేరారు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ (ఢిల్లీ), ఐఐఎం (కోల్‌కతా)లో విద్యాభ్యాసం చేశారు. IFFCOలో ఫుల్ టైమ్ డైరెక్టరుగా చేరడానికి ముందు భారత ప్రభుత్వంలో IRS అధికారిగాను, వివిధ ప్రభుత్వ సంస్థల్లో సీనియర్ హోదాల్లోనూ సేవలు అందించారు. IFFCO వివిధ రంగాల్లోకి విస్తరించడంలోనూ, పలు అనుబంధ సంస్థలను పునర్‌వ్యవస్థీకరించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. IFFCOతో పాటు IFFCOలోని పలు అనుబంధ, అసోసియేట్ కంపెనీల బోర్డుల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు.

మరింత చదవండి
Yogendra Kumar
శ్రీ యోగేంద్ర కుమార్
డైరెక్టర్ – (మార్కెటింగ్)

శ్రీ యోగేంద్ర కుమార్ IFFCO మార్కెటింగ్ డైరెక్టరు హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దేశీయంగా తయారైన/దిగుమతి చేసుకున్న ఎరువులను దాదాపు దేశవ్యాప్తంగా విస్తరించిన సహకార సంఘాల భారీ నెట్‌వర్క్ ద్వారా ప్లానింగ్ / పంపిణీ మరియు విక్రయ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తారు. IFFCO ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. IFFCOతో పాటు IFFCO ఈబజార్ లిమిటెడ్, IFFDC, IFFCO-MC క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, CORDET మొదలైన వాటి బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు. విస్తృతంగా పర్యటించే శ్రీ కుమార్, వ్యవసాయంపై అనేక ఆర్టికల్స్ రాశారు. సహకార ఉద్యమ అభివృద్ధి మరియు భారతీయ రైతుల సామాజిక-ఆర్థిక పురోభివృద్ధికి ఆయన గట్టి మద్దతుదారు.

మరింత చదవండి
Birinder Singh
శ్రీ బీరీందర్ సింగ్
డైరెక్టర్ (కార్పొరేట్ సర్వీసెస్)

శ్రీ బీరీందర్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని IFFCO కార్పొరేట్ ఆఫీసులో డైరెక్టరు (కార్పొరేట్ సర్వీసెస్) హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త ప్రాజెక్టులను గుర్తించడం, నెలకొల్పడం, ప్రాజెక్టు ముందస్తు కార్యకలాపాలను నిర్వహించడం, సామాజిక లాభదాయకతపై ఎరువుల విధాన ప్రభావాన్ని విశ్లేషించడం మరియు ఇతరత్రా కార్పొరేట్ సర్వీసులకు సంబంధించిన అంశాలను ఆయన పర్యవేక్షిస్తారు. కలోల్ మరియు ఇతర ప్రాంతాల్లో నానో ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. IFFCOలో గత నాలుగు దశాబ్దాల పైగా దేశీయంగా వివిధ ప్రాంతాల్లో మరియు విదేశాల్లో పలు కీలక అసైన్‌మెంట్లకు సారథ్యం వహిస్తున్నారు. ఆయన అపార అనుభవమున్న టెక్నోక్రాట్. ఎరువుల రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు, సెమినార్లలో ఆయన తరచూ వక్తగా పాల్గొంటూ ఉంటారు.

మరింత చదవండి
GK Gautam
శ్రీ జి. కె. గౌతమ్
డైరెక్టర్ (టెక్నికల్)

శ్రీ జి.కె. గౌతమ్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ (టెక్నికల్) హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికన్నా ముందు ఆఁవ్లాలోని IFFCO అమోనియం-యూరియా ప్లాంటుకు ఆయన సారథ్యం వహించారు. రూర్కీలోని ఐఐటీ నుంచి మెకానికల్ ఇంజినీర్ పట్టా పొందిన శ్రీ గౌతమ్ 1981లో IFFCO ఫూల్‌పూర్ యూనిట్‌లో చేరారు. ఫూల్‌పూర్ మరియు ఆఁవ్లాలోని IFFCO ప్లాంట్లలో వివిధ సీనియర్ హోదాల్లో ఆయన సేవలు అందించారు. అలగే ఒమన్ ఇండియా ఫెర్టిలైజర్ కంపెనీ ఎస్ఏవోసీ (OMIFCO) ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ ఇంచార్జిగా కూడా ఆయన వ్యవహరించారు.

మరింత చదవండి
AK Gupta
శ్రీ ఎ.కె. గుప్తా
డైరెక్టర్ – (ఐటీ సర్వీసులు)

శ్రీ ఎ.కె. గుప్తా IFFCO డైరెక్టరు (ఐటీ సర్వీసులు) హోదాలో ఉన్నారు. న్యూఢిల్లీలోని IFFCO కార్పొరేట్ కార్యాలయంలోని ఐటీ & ఈ-కామర్స్ విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. కురుక్షేత్రలోని ఎన్‌ఐటీలో ఆయన ఇంజినీరింగ్ చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దన్నుతో వ్యాపార ప్రక్రియలను ఆధునీకరించడం ద్వారా సంస్థ ఉత్పాదకత మరియు లాభదాయకతను మెరుగుపర్చడంలో శ్రీ గుప్తా కీలకపాత్ర పోషిస్తున్నారు. విస్తృతంగా పర్యటించే శ్రీ గుప్తా పలు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక ఐటీ సెమినార్లలో వక్తగా పాల్గొనడంతో పాటు IFFCO తరఫున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక ఐటీ పురస్కారాలు అందుకున్నారు.

మరింత చదవండి
DG Inamdar
శ్రీ డి.జి. ఇనామ్‌దార్
డైరెక్టర్

శ్రీ డి.జి. ఇనామ్‌దార్ 2017 జనవరి నుంచి IFFCO కలోల్ యూనిట్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఫూల్‌పూర్, కలోల్ యూనిట్‌లలోని మెయింటెనెస్ విభాగంలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్లాంట్ మెయింటెనెన్స్‌లో అపార అనుభవం ఉంది. కలోల్ విస్తరణ ప్రాజెక్టు మరియు ఎనర్జీ సేవింగ్ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ దశలు పూర్తి కావడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు.

మరింత చదవండి
KJ Patel
శ్రీ కె.జె. పటేల్
డైరెక్టర్

శ్రీ కె.జె. పటేల్ IFFCO డైరెక్టరు హోదాలో ఉన్నారు. పారాదీప్ యూనిట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. గుజరాత్‌లోని సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీర్ పట్టా అందుకున్నారు. నత్రజనియుక్త మరియు ఫాస్ఫేటిక్ ఎరువుల ప్లాంట్ల నిర్వహణలో ఆయనకు 32 ఏళ్ల పైగా అనుభవం ఉంది. 2012లో పారదీప్ యూనిట్‌లో చేరడానికి ముందు, ఆయన కలోల్ యూనిట్‌లో 23 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. విస్తృతంగా పర్యటించే టెక్నోక్రాట్ అయిన శ్రీ పటేల్ ప్లాంటు నిర్వహణ టెక్నాలజీలకు సంబంధించి అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు ప్రెజెంటేషన్లు ఇచ్చారు. అనేక పత్రాలు రాశారు.

మరింత చదవండి

సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు

Nakul Pathak
శ్రీ నకుల్ పాఠక్
సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్)

శ్రీ నకుల్ పాఠక్ ప్రస్తుతం ఢిల్లీలోని IFFCO ప్రధాన కార్యాలయంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్ఆర్)గా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీ పాఠక్ 1985లో GETగా IFFCOలో చేరారు. గత మూడు దశాబ్దాలుగా సంస్థలో వివిధ విభాగాల్లో కీలక హోదాల్లో సేవలు అందిస్తున్నారు. భారత్ మరియు ఒమన్‌లో ఎరువుల ప్లాంట్ల నిర్మాణం, ప్రీ-కమిషనింగ్, కమిషనింగ్ వంటి అనేక టెక్నికల్ ప్రాజెక్టుల్లో పనిచేశారు. ప్రస్తుత హోదాలో హెచ్‌ఆర్ విభాగానికి సంబంధించిన అన్ని కీలక కార్యకలాపాలను శ్రీ పాఠక్ పర్యవేక్షిస్తున్నారు. 2012లో హెచ్ఆర్ విభాగంలో చేరినప్పట్నుంచి అనేక సంస్కరణలను విజయవంతంగా అమలు చేశారు. NHRDN, AIMA, DMA, NIPM వంటి ప్రొఫెషనల్ సంస్థల్లో సభ్యులుగా ఉన్నారు. అలాగే మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ సంస్థలు మరియు పరిశ్రమ ఫోరమ్‌లు నిర్వహించే సమావేశాలకు తరచూ సారథ్యం వహిస్తుంటారు.

మరింత చదవండి
Rakesh Puri
శ్రీ రాకేష్ పురి
సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

కెమికల్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీ రాకేశ్ పురికి ప్రాజెక్ట్ నిర్వహణ, ఇంజినీరింగ్ & అమ్మోనియా ప్లాంట్ కార్యకలాపాలు మొదలైన విభాగాల్లో అపార అనుభవం ఉంది. ఆఁవ్లా విస్తరణ ప్రాజెక్టు, విద్యుత్ ఆదా చేసే మరియు సామర్థ్యాలను పెంపొందించే ప్రాజెక్టులు మొదలైన అనేక ప్రాజెక్టుల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. విస్తృతంగా పర్యటించే టెక్నోక్రాట్ అయిన శ్రీ పురి, ఎరువుల సాంకేతికతలపై పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అనేక ప్రెజంటేషన్స్ ఇచ్చారు. పలు పత్రాల ద్వారా పుష్కలమైన తన అనుభవాలను పంచుకున్నారు. 35 సంవత్సరాలకు పైగా IFFCO ద్వారా ఎరువుల పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఆఁవ్లా యూనిట్‌కు సారథ్యం వహిస్తున్నారు.

మరింత చదవండి
Devendra Kumar
శ్రీ దేవేందర్ కుమార్
సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్)

శ్రీ దేవేందర్ కుమార్ ప్రస్తుతం సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా (ఫైనాన్స్ & అకౌంట్స్) విధులు నిర్వర్తిస్తున్నారు. IFFCO ఆర్థిక విభాగ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ గల శ్రీ కుమార్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో ఫెలో మెంబర్‌గా ఉన్నారు. 1987లో ఆయన IFFCOలో చేరారు. IFFCOలో 35 ఏళ్లుగా కార్పొరేట్ బడ్జెటింగ్, కార్పొరేట్ అకౌంటింగ్‌, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఆడిట్‌కి సంబంధించి వివిధ కీలక హోదాల్లో సేవలు అందించారు. దేశ, విదేశాల్లో ఫైనాన్స్, జనరల్ మేనేజ్‌మెంట్ అంశాలపై వివిధ ప్రోగ్రామ్‌లకు ఆయన హాజరయ్యారు. దేశ, విదేశాల్లో IFFCOకు చెందిన వివిధ అనుబంధ సంస్థల బోర్డులు, కమిటీల్లో క్రియాశీలక సభ్యునిగా ఉన్నారు.

మరింత చదవండి
Tomgee Kallingal
శ్రీ టోమ్‌జీ కల్లింగల్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రవాణా)

శ్రీ కల్లింగల్ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా (ట్రాన్స్‌పోర్టేషన్) విధులు నిర్వర్తిస్తున్నారు. ఎరువుల రైలు మరియు రోడ్డు రవాణా, రేక్ హ్యాండ్లింగ్, స్టోరేజీ కార్యకలాపాలు, తీరప్రాంత మరియు అంతర్గత నదీమార్గాల్లో రవాణా సహా IFFCO ఇన్‌ల్యాండ్ లాజిస్టిక్స్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. కాలికట్ యూనివర్సిటీలోని GECT నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో శ్రీ కలింగల్‌ బీటెక్ పట్టా పొందారు. IFFCO ఫూల్‌పూర్ యూనిట్లో GETగా 1986 జనవరిలో ఆయన తన కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత ప్రధాన కార్యాలయం మరియు మార్కెటింగ్ విభాగంలో IFFCOలో సేవలు అందించారు. ఆరేళ్ల పాటు SMMగా కేరళ IFFCOలో మార్కెటింగ్ కార్యకలపాలకు సారథ్యం వహించారు. తర్వాత కొంత కాలం రాజస్థాన్‌లో విధులు నిర్వర్తించారు. ప్లాంట్ నిర్వహణ, క్షేత్ర స్థాయిలో ఎరువుల మార్కెటింగ్, కాంట్రాక్టింగ్ ప్రక్రియ, షిప్పింగ్, పోర్టు కార్యకలాపాలు, వేర్‌హౌసింగ్, ఎరువుల లాజిస్టిక్స్ మరియు రవాణా వంటి విభాగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. ఎరువుల పరిశ్రమకు ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా IFFCO కోస్టల్ మూవ్‌మెంట్‌ను చేపట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

మరింత చదవండి
Mr. Sanjay Kudesia
శ్రీ సంజయ్ కుదేసియా
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ కుదేసియా ప్రస్తుతం ఫూల్‌పూర్ ప్లాంట్ హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీ కుదేసియా IIT, BHU నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో B.Tech పట్టా పొందారు. ఆయన 1985 నవంబర్‌లో IFFCOలో GETగా చేరారు. అప్పటినుంచి ఆఁవ్లా యూనిట్, ఒమన్‌లోని OMIFCOలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. 2005లో కొత్తగా కొనుగోలు చేసిన పారాదీప్ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్ ప్లాంటును టర్నెరౌండ్ చేయడంలోను, పునరావాస పనుల్లోనూ సేవలు అందించారు. ఫూల్‌పూర్ యూనిట్ హెడ్‌గా 2021లో పదోన్నతి పొందే ముందు ఆయన P&A హెడ్‌గా విధులు నిర్వర్తించారు.

మరింత చదవండి
KN Joshi
శ్రీ కె.ఎన్. జోషి
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కమర్షియల్)

శ్రీ కేఎన్ జోషి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా (కమర్షియల్) విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీ జోషి 1982లో IFFCOలో చేరారు. IFFCOలో అఁవ్లా, కలోల్ యూనిట్లలోను, ఈజిప్టులో అంతర్జాతీయ అసైన్‌మెంట్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు 30 ఏళ్ల సుదీర్ఘానుభవం ఉంది. 2012 నుంచి ఆయన కార్పొరేట్ ఆఫీసులో సేవలు అందిస్తున్నారు. IFFCOకు చెందిన అన్ని ఎరువుల ప్లాంట్ల సమన్వయంతో ముడి వస్తువుల దిగుమతులు, కమర్షియల్ & ప్రొక్యూర్‌మెంట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

మరింత చదవండి
O.P Dayama
శ్రీ ఒ.పి. దయామా
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఒ.పి. దయామా 01.11.2019 నుండి IFFCO కాండ్లా యూనిట్ బాధ్యతలు చేపట్టారు. కెమికల్ ఇంజినీరింగ్లో ఆయన B.E. పట్టా పొందారు. IFFCO ఫూల్‌పూర్ యూనిట్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్‌గా ఆయన కెరియర్ ప్రారంభించారు. IFFCOలో ముడు దశాబ్దాల పైగా కెరియర్‌లో ఆయన వివిధ ప్రాజెక్టుల్లో, ఫుల్‌పూర్ మరియు కలోల్ ప్లాంట్ల ఏర్పాటు, కార్యకలాపాల ప్రారంభంలోనూ సేవలు అందించారు. ఒమన్‌లో IFFCO విదేశీ జాయింట్ వెంచర్ OMIFCO ఏర్పాటులోనూ ఆయన సేవలు అందించారు.

మరింత చదవండి