
లాభాపేక్ష లేని కార్యక్రమాలు
ఇండియన్ ఫార్మ్ ఫారెస్టరీ డెవలప్ మెంట్ కోపరేటివ్ లిమిటెడ్
‘ఇండియన్ ఫార్మ్ ఫారెస్టరీ డెవలప్ మెంట్ కోపరేటివ్ లిమిటెడ్’( ఐఎఫ్ఎఫ్ డిసి) ని 1993లో ఏర్పాటు చేశారు. ఇది అనేక రాష్ట్రాలకు సంబంధించిన కొపరేటివ్ సొసైటీ. కలిసికట్టుగా చర్యలు చేపట్టి పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేయడ వేసి సహజవనరులను స్థిరంగా ఉంచుకోవాలన్నదే దీని ప్రధాన లక్ష్యం. అదే సమయంలో గ్రామీణ పేదలు, గిరిజన వర్గాలు, ప్రత్యేకించి మహిళలు అర్ధికంగా-సామాజికంగా ఎదిగేందుకు తోడ్పాటునివ్వాలి.
రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు , 19,331 మంది సభ్యలతో కూడిన 152 గ్రామస్థాయి ‘ఇండియన్ ఫార్మ్ ఫారెస్టరీ డెవలప్ మెంట్ కోపరేటివ్ సొసైటీ (ఐఎఫ్ఎఫ్ డిసిఎస్)లు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు, వృథాగా ఉన్న, ఎండిపోయిన 29,420 హెక్టార్ల భూమిని బహుళ ప్రయోజన అడవులుగా మార్చారు. ఈ భూమంతా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉంది. ప్రస్తుతం, దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాలోనూ ఐఎఫ్ఎఫ్ డిసి ఉంది. 18 కోట్ల రూపాయలు విలువైన వేరు వేరు ప్రాజెక్టులను అమలు చేస్తోంది.
Pప్రస్తుతం జీవనోపాధి, వ్యవసాయం, తోట్లపెంపకం, సహజ వనరుల నిర్వహణ, మహిళాసాధికారితకు సంబంధించి ఐఎఫ్ఎఫ్ డిసి 29 ప్రాజెక్టులు అమలు చేస్తోంది. 9 రాష్ట్రాల్లోని 9,459 గ్రామాల్లో వీటిని అమలు చేస్తున్నారు. 16,974 హెక్టార్లలో వాటర్ షెడ్ ప్రాజెక్టులు చేపట్టారు. ఐఎఫ్ఎఫ్ డిసి, నాబార్డు భాగస్వామ్యంతో అగ్రీ-హార్టీకల్చర్ ప్రోగ్రామ్ కింద 3406 హెక్టార్ల భూమిలో 8,515 వాడీలు (చిన్న చిన్న తోటలు) అభివృద్ధి చేసింది. వేరు వేరు ప్రాజెక్టుల కింది 1,715 స్వయం సహాయక బృందాల(ఎస్ హెచ్ జి) కు ఐఎఫ్ఎఫ్ డిసి నిధులు, వనరులు సమకూర్చుతోంది. వీటిలో 18,299 మంది సభ్యులు ఉన్నారు, ఇందులో 95 శాతం మంది మహిళలే. ఐఎఫ్ఎఫ్ డిసి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి