మల్టీ యూనిట్ సహకార సంఘంగా 1967 నవంబర్ 3న ఇఫ్కో రిజిస్టర్ అయ్యింది. గడిచిన ఐదు దశాబ్దాలలో, ఒకవైపు భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సాధికారత కల్పించాలన్న లక్ష్య సాధన కోసం పాటుపడుతూనే మరోవైపు దేశంలోనే అత్యంత విజయవంతమైన సహకార సంఘాల్లో ఒకటిగా ఇఫ్కో ఎదిగింది. పురోగతికి, శ్రేయస్సుకు సహాకార విధానమే సరైన చుక్కాని కాగలదని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము.
(మూలం: ICA)

స్వాతంత్ర్యానంతరం పారిశ్రామిక విప్లవం దన్నుతో పురోగమించాలన్న బలీయమైన ఆకాంక్ష గల సరికొత్త భారత్ ఆవిర్భవించింది. ఈ సరికొత్త ఆకాంక్షలు దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత పటిష్టం చేశాయి. పంచవర్ష ప్రణాళికల్లో దాన్ని కూడా భాగంగా మార్చాయి.
1960ల నాటికి దేశంలో సహకార ఉద్యమం పటిష్టంగా వేళ్లూనుకుంది. వ్యవసాయం, పాడి, కన్జూమర్ ఉత్పత్తులు, ఆఖరికి పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థల్లోనూ పారిశ్రామిక దిగ్గజాలు ఈ విధానాన్ని పాటించడం ప్రారంభించాయి.

ఆర్థిక పురోగతి, అభివృద్ధి సాధించాలన్న తపన స్వతంత్ర భారతావనిని కొత్త ఉత్తేజంతో ఉరకలు వేయించింది. సహకార సంఘాలకు ప్రాధాన్యం పెరిగింది. 5 ఏళ్ల ఆర్థిక ప్రణాళికల్లో ఇవి కూడా భాగంగా మారాయి. తొలి పంచవర్ష ప్రణాళిక (1951-56) విజయవంతం కావడానికి ప్రణాళికల అమల్లో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించడమే కారణమని చెబుతారు. ఆ విధంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఇవి ప్రత్యేక భాగంగా మారాయి.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాన మంత్రి

శ్రీ దీన్దయాళ్ ఉపాధ్యాయ దార్శనికుడు
Cooperative Information Officer : Ms Lipi Solanki, Email- coop@iffco.in












