


డిఎపి 18-46-0
-
ఇఫ్కో వారి డిఎపి (డైఅమ్మోనియం ఫాస్పేట్) అధిక గాఢత కలిగిన ఫాస్పేట్ ఆధారిత ఎరువు. నైట్రోజన్ లాగే పాస్పరస్ కూడా కీలమైన పోషకమే. అప్పుడే మొలకెత్తిన మొక్కల్లో కణజాల అభివృద్ధికి, పంటల్లో ప్రొటీన్ సింథసిస్ ప్రక్రియ క్రమబద్దం కావడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
పంట అన్ని దశల్లోనూ ఎదుగదలకు, అభివృద్ధికి కీలకమైన పాస్పరస్ పోషకాన్నిడిఎపి అందిస్తుంది. అలాగే పంటలకు ప్రాధమిక అవసరం అయిన నైట్రోజన్, సల్ఫర్ అవసరాలను కూడా తీరుస్తుంది. ఇఫ్కోవారి డిఎపి పరిపూర్ణమైన పోషకాల ప్యాకేజీ. దీంతో దిగుబడి పుష్కలంగా ఉంటుంది.
ముఖ్యమైన లాభాలు
మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాల మిశ్రమం
వేర్లు వేగంగా అభివృద్ధి చెందేందుకు, మొక్క బాగా ఎదిగేందుకు తోడ్పడుతుంది
కాండం ఆరోగ్యంగా ఎదగడానికి, మంచి దిగుబడికి సహాయపడుతుంది.

డిఎపి 18-46-0 ఉపయోగించడం ఎలా
డిఎపి ని నేలలో వేయడానికి, ఎంతెంత్త దూరంలో వేయాలి, ఏ నిష్పత్తిలో వేయాలి, పంటలో వివిధ దశలు వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకోవాలి.
డిఎపి ని విత్తనాలు లేదా మొక్కలు నాటడానికి ముందు పొలాన్ని దుక్కి దున్నేటప్పుడు లేదా విత్తేటప్పుడు చల్లుకోవాలి.
ఎంత మోతాదులో వేయాలన్నది పంట, నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. (రాష్ట్రాన్ని బట్టి సాధారణ సూచనలు ఉన్నాయి.) ఎదిగిన పంటలకు డిఎపి వాడకూడదు.
డిఎపి ని విత్తనాలకు దగ్గరగా వేస్తే నేలలో కరిగిపోతుంది. నేల అమ్లత్వాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది. దాంతో పంట ప్రారంభ దశలో మొలకలు ఎరువుల్ని బాగా గ్రహించగలుగుతాయి.