
ఇఫ్కో ప్రధాన ప్లాంట్
ఇఫ్కో మొట్టమొదటి యూరియా అండ్ అమోనియా తయారీ కేంద్రం కాలోల్ లోని ఉత్పాదక యూనిట్. ఇది 1974లో ప్రారంభమైంది. అప్పట్లో దీని ఉత్పాదకసామర్ధ్యం అమ్మోనియా 910 ఎంటిపిడి, యూరియా 1200 ఎంటిపిడి. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఐఫ్కో కలోల్ ఉత్పాదక కేంద్రాన్ని విస్తరిస్తూ, ఎప్పటికప్పుడుకొత్త మెరుగులద్దుతూ ఉత్పాదన పరంగా, టెక్నాలజీ పరంగా ఆధునిక యూనిట్లుకు దీటుగా తయారు చేశారు. ప్రస్తుంతం ఇఫ్కో కలోల్ ఉత్పదక సామర్ద్య అమ్మోనియా 1100 ఎంటిపిడీ , యూరియా 1650 ఎంటిపిడి లు.

ఉత్పాదక సామర్ధ్యం- టెక్నాలజీ
ఇఫ్కో కలోల్ ప్లాంట్ లో 40 ఏళ్ల క్రితం ఉత్పాదన మొదలైంది. ఇప్పటికీ కూడా ఉత్పాదక సామర్ధ్యం విషయంలో అతిపెద్ద యూనిట్లలో ఒకటి.
ఉత్పత్తి | రోజువారి ఉత్పత్తి సామర్ద్యం( రోజుకి మెట్రిక్ టన్నుల్లో) (రోజుకి మెట్రిక్ టన్నుల్లో) |
వార్షిక ఉత్పత్తి సామర్ద్యం( ఏడాదికి మెట్రిక్ టన్నుల్లో) (ఏడాదికి మెట్రిక్ టన్నుల్లో) |
టెక్నాలజీ |
అమ్మోనియా | 1100 | 363000 | కెలాగ్, యూఎస్ఎ |
యూరియా | 1650 | 544500 | స్టామికార్బన్, నెదర్లాండ్ |
ఉత్పత్తి ట్రెండ్స్
ఎనర్జీ ట్రెండ్స్
ప్లాంట్ హెడ్

శ్రీ సందీప్ ఘోష్ సీనియర్ జనరల్ మేనేజర్
శ్రీ సందీప్ ఘోష్ జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. అతను 1988లో IFFCO కలోల్ యూనిట్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌గా చేరాడు. ఉత్పత్తి నిర్వహణ, ప్రాజెక్ట్ కాన్సెప్ట్ నుండి IFFCO కలోల్‌లో అమ్మోనియా & యూరియా ప్లాంట్లను ప్రారంభించడం వరకు అతని అనుభవం 36 సంవత్సరాల వరకు విస్తరించి ఉంది. అతను గతంలో IFFCOలో అనేక కీలక పదవులను నిర్వహించాడు, ఇందులో NFP-II ప్రాజెక్ట్ యొక్క ప్రాజెక్ట్ హెడ్ మరియు కలోల్‌లోని నానో ఫర్టిలైజర్ ప్లాంట్ యొక్క యూనిట్ హెడ్‌గా కూడా ఉన్నారు. ప్రస్తుతం, అతను సీనియర్ జనరల్ మేనేజర్ పదవిని కలిగి ఉన్నాడు మరియు కలోల్ యూనిట్‌కు అధిపతిగా ఉన్నాడు.
అవార్డులు, ప్రశంసలు
సర్టిఫికెట్లు
కలోల్ యూనిట్ గొప్పదనాన్ని తెలియజేసే సర్టిఫికెట్లు:
- ఎనర్జీ మేనేజ్ మెంట్ సిస్టమ్(ఇఎంఎస్) కి సంబంధించి ఐఎస్ఒ 50001:2011
- క్వాలిటీ మేనేజ్ మెంట్ సిస్టమ్ ఉన్న ఇంటిగ్రేటెడ్ మేనేజ్ మెంట్ సిస్టమ్(ఐఎంఎస్) (ISO 9001:2015)
- ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ISO 14001:2015)
- వృత్తిపరమైన ఆరోగ్య, భద్రతా మేనేజ్ మెంట్ సిస్టమ్ (OHSAS 18001:2007)
- కస్తూరినగర్ టౌన్ షిప్ కి ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ISO 14001:2015) మరియు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) ఇచ్చే గ్రీన్ రెసిడెన్సియల్ సోసైటీ రేటింగ్ సిస్టమ్ లో ప్లాటినం కేటగిరి
వర్తింపు నివేదికలు
EC షరతుల సమ్మతి స్థితిపై ఆరు నెలవారీ నివేదికలు
ఇతర కార్యకలాపాలు
కలోల్ లో ఎనర్జీ సేవింగ్ ప్రాజెక్టు(ఇపిఎస్)
సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు ఈమధ్యకాలం(2016-18)లో కలోల్ ప్లాంట్ లో అనేక నవీనికరణ పనులు, పథకాలు అమలు చేశారు.
అమ్మోనియా ప్లాంట్
- సరికొత్త సెకండరీ రీఫార్మర్ బర్నర్
- ప్రాధమిక వేస్ట్ హీట్ బాయిలర్(101-CA/B) లైనర్ ను మెరుగైన కనస్ట్రక్షన్ మెటీరియల్ (ఎంఒసి) తో మార్చారు
- యాక్టివేటెడ్ కార్బన్ కి బదులుగా హైడ్రో డిసల్పరైజేషన్ చేసిన ఫీడ్ బ్యాగులు
- మెరుగైన కనస్ట్రక్షన్ మెటీరియల్ తో కూడిన కొత్త ప్రోసెస్ ఎయిర్ సిస్టమ్ కాయిల్
- సింక్రోనైజేషన్ గ్యాస్ కంప్రెసర్ లో రెండు టర్బైన్లకు బదులుగా, కొత్త సింగిల్ స్ట్రీమ్ టర్బైన్(103-JT)
- మెరుగైన డిజైతో ఉన్న కొత్త మెతనేటర్ ఎగ్జిట్ కూలర్ (115-C)
- ఎల్ పి ప్రోసెస్ కండెన్సేట్ స్ట్రిప్పర్ కి బదలుగా ఎంపీ ప్రోసెస్ కండెన్సేట్ స్ట్రిప్పర్
- గ్యాసెస్ లేని ఎల్పీ ఫ్లాష్ సింక్రనైజేషన్ లూప్ నుంచి అమ్మోనియాను రికవరీ చేయడం
- ఎక్కువ ప్రాంతం మేర మంచిగా వేడిని గ్రహించడానిక కొత్త లోటెంపరేచర్ హెచ్ పి స్ట్రీమ్ సూపర్ హీట్ కాయిల్.
యూరియా ప్లాంట్
- యూరియా రియాక్టర్ లో అధిక సామర్ధ్యం కలిగిన ట్రే (హెచ్ఇటి)
- CO2 కూలింగ్ కోసం విఎఎం ప్యాకేజీ
- డైరెక్ట్ కాంటాక్ట్ కూలింగ్ స్థానంలో కొత CO2
- హెచ్ పి అమ్మోనియా ప్రీహీటర్(H 1250)
- హెచ్ పి స్ప్లిట్ ఫ్లో లూప్, కొత్త హై ప్రెజర్ కార్బామేట్ కండెన్సర్(హెచ్ పిసిసి)
- హెచ్ పి లూప్ లో హెచ్ పి కార్బమేట్ ఎజెక్టర్
- ఎక్కువ ప్రాంతం కోసం కొత్త రెండో స్థాయి ఎవాపరేటర్ హిట్ ఎక్స్ ఛేజంర్.
విస్తరణ ప్రాజెక్టు ఫేజ్ II
మొత్తం కాంప్లెక్స్ అవసరాల కోసం ఆఫ్ సైట్ /యుటిలిటీ, కాపిటివ్ పవర్ ప్లాంట్ తో కూడిన ఒక అమ్మోనియా-యూరియా కాంప్లెక్స్.