
రైతుల కోసం, రైతులచే, రైతుల వద్దకు
రైతులు సమర్ధమంతమైన ఎరువులను సమతూకంతో ఉపయోగించుకుని, అధిక దిగుబడులను సాధించడంలో సహాయపడటం ద్వారా వారికి అదనపు ఆదాయాలను పెంచడం; పర్యావరణ ఆరోగ్యాన్ని కాపాడటం; గ్రామీణ భారతానికి సాధికారత అందించగలిగేలా రైతాంగానికి ప్రొఫెషనల్ సర్వీసులు ఇచ్చే విధంగా సహకార సంఘాలను ఆర్థికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పటిష్టంగా చేయడం.

కార్పొరేట్ వృద్ధి ప్రణాళికలు
ఎదుగుదల మరియు అభివృద్ధిని సాధించే క్రమంలో IFFCO 'మిషన్ 2005', 'విజన్ 2010' మరియు 'విజన్ 2015' అనే కార్పొరేట్ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసింది. భారతదేశంలో రసాయనిక ఎరువులకు సంబంధించి అతి పెద్ద తయారీదారు మరియు పంపిణీదారుగా ఆవిర్భవించేందుకు, అలాగే విదేశాల్లో ప్రాజెక్టులు మరియు జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటు చేయడం ద్వారా అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థగా ఎదిగేందుకు IFFCOకు ఈ ప్రణాళికలు సహాయపడ్డాయి.
విజన్: తదుపరి దశలో మరింత వృద్ధి మరియు పురోగతి సాధించే క్రమంలో IFFCOకు ఈ కింద పేర్కొన్న లక్ష్యాలు మార్గనిర్దేశం చేస్తాయి
ప్రస్తుత ప్లాంట్లను ఆధునీకరించడం ద్వారా విద్యుత్‌ను ఆదా చేసేందుకు నిర్దిష్ట లక్ష్యాలను సాధించడం
కొత్త ఎరువుల ఉత్పత్తుల తయారీ, ఆగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లు మరియు రసాయనాల ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం
ఈ-కామర్స్‌లోకి విస్తరించడం మరియు వెంచర్ క్యాపిటల్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం
వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా విదేశాల్లోఎరువుల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం
సహకార సంఘాల కోసం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయడం
మా విజన్ కింద సాధించతగిన లక్ష్యాలు
- ఎరువుల ఉత్పత్తిలో అంతర్జాతీయ దిగ్గజంగా ఎదగడం
- విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం మరియు వనరులను మెరుగ్గా నిర్వహించుకోవడం ద్వారా సుస్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు వ్యూహాలు అమలు చేయడం
- ఫార్వర్డ్/బ్యాక్‌వర్డ్ కార్యకలాపాల అనుసంధానం ద్వారా ప్రధాన వ్యాపార బలాలను గరిష్టంగా వినియోగించుకోవడం
- వ్యూహాత్మక జాయింట్ వెంచర్లు మరియు వ్యాపారానికి అనుగుణంగా ఉండే సంస్థల కొనుగోళ్ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో మరింతగా విస్తరించడం
- ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇతర రంగాల్లోకి విస్తరించడం
- సమీకృత పోషక నిర్వహణ మరియు సముచిత స్థాయిలో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం
- సహకార సంఘాలు ఆర్థికంగా బలపడేందుకు, ప్రొఫెషనల్‌గా నిర్వహించబడేందుకు సహాయం అందించడం. అలాగే అధునాతన వ్యవసాయ విధానాలతో ఉత్పాదకతను పెంచుకునేందుకు రైతాంగానికి తగిన సహకారం అందించడం. తద్వారా గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పించడం
- ఏటా 15 మిలియన్ టన్నుల ఎరువుల మార్కెటింగ్ లక్ష్యాన్ని సాధించడం
మా లక్ష్యం
"పర్యావరణానికి ప్రయోజనకరమైన తీరుగా విశ్వసనీయమైన, అత్యంత నాణ్యమైన వ్యవసాయ ముడిపదార్థాలు మరియు సేవలను సకాలంలో అందించడం ద్వారా భారతీయ రైతుల శ్రేయస్సుకు తోడ్పాటునివ్వడం మరియు వారి సంక్షేమాన్ని మెరుగుపర్చేందుకు ఇతరత్రా కార్యకలాపాలు చేపట్టడం" అనేది IFFCO లక్ష్యం
- పంట ఉత్పాదకతను పెంచేలా రైతులకు సకాలంలో మరియు తగినంత పరిమాణంలో అత్యంత నాణ్యమైన ఎరువులను అందించడం.
- సామాజిక జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఆరోగ్యం, భద్రత, పర్యావరణ మరియు అడవుల అభివృద్ధికి కట్టుబడి ఉండటం.
- ప్రధాన విలువలను సంస్థాగతంగా పెంపొందించడం మరియు ఉద్యోగుల పురోభివృద్ధికి తోడ్పడటంతో పాటు వ్యూహాత్మక లక్ష్యాలను సాధించడంలో సహాయపడే విధంగా టీమ్‌లను నిర్మించుకోవడం, సాధికారత మరియు నవకల్పనలకు అనువైన సంస్కృతిని సృష్టించడం.
- సంబంధిత వర్గాలందరికీ పని చేయడమనేది ఉత్తేజకరంగా, సవాళ్లను పరిష్కరించే అనుభూతిని కల్పించే విధంగా విశ్వసనీయమైన, స్వేచ్ఛాయుతమైన మరియు పరస్పరం సంప్రదించుకునేటువంటి సంస్కృతిని పెంపొందించడం.
- విశ్వసనీయమైన, సమర్ధమంతమైన మరియు వ్యయాలను తగ్గించే సాంకేతికతలను దక్కించుకోవడం, శోషించుకోవడం మరియు అమలు చేయడం.
- దేశీయంగా సహాకర ఉద్యమాన్ని పెంపొందించేందుకు కట్టుబడి ఉన్న సిసలైన సహకార సంఘం. క్రియాశీలకమైన సంస్థగా, వ్యూహాత్మక బలాలపై దృష్టి పెడుతూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం. గత విజయాలు పునాదిగా కొత్త విజయాలను సాధించేందుకు, వాటాదారుల ఆదాయాలను గరిష్టంగా పెంచేందుకు వాటిని ఉపయోగించుకోవడం.
- మొక్కలు శక్తిని సమర్ధంగా వినియోగించుకునేలా చేయడం మరియు విద్యుత్‌ను ఆదా చేసేందుకు నిరంతరం వివిధ స్కీములను సమీక్షించడం.
- విదేశాల్లో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఫాస్ఫేటిక్ ఎరువుల ఉత్పత్తి కోసం ముడి సరుకులను చౌకగా కొనుగోలు చేయడం.
- కస్టమరు ప్రధానంగా మెరుగ్గా, సత్వరం స్పందించే విధంగా విలువల ఆధారిత సంస్థను నిర్మించడం. పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమగ్రతను తూచా తప్పకుండా పాటించేందుకు కట్టుబడి ఉండటం.
- సమాజంలో పటిష్టంగా నిల్చేలా సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉండటం.
- ప్రధాన మరియు ప్రధానయేతర రంగాల్లో వృద్ధి సాధనపై దృష్టి పెట్టడం.