
లాభం కోసం కాదు చొరవలు
సహకార గ్రామీణాభివృద్ధి ట్రస్టు
భారతదేశవ్యాప్తంగా వ్యవసాయ రంగ వర్గాలకు విద్యా, శిక్షణ కల్పించే లక్ష్యంతో ఇఫ్కో 1978లో కోఆపరేటివ్ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (సీవోఆర్‌డీఈటీ)ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఫూల్‌పూర్, కలోల్, కాండ్లా, ఆఁవ్లా మరియు పారదీప్‌లోని తమ కేంద్రాల ద్వారా సీవోఆర్‌డీఈటీ కార్యకలాపాలు సాగిస్తోంది.
సాగు విధానాల నమూనాలను ఆవిష్కరించడం, అనేక శిక్షణ మరియు నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా రైతుల వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో సీవోఆర్‌డీఈటీ కీలకపాత్ర పోషిస్తోంది. సీవోఆర్‌డీఈటీ తమ కేంద్రాల్లో పంటల ఉత్పత్తి వ్యవస్థలు, పాడి, సమతూక ఫెర్టిలైజేషన్, జీవ ఎరువుల వినియోగం, తేనెటీగల పెంపకం, చేపల పెంపకం, కంప్యూటర్ వినియోగం, స్క్రీన్ ప్రింటింగ్, వెల్డింగ్, టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ, వయోజన విద్య కార్యక్రమాలు, పళ్లు మరియు కూరగాయల నిల్వ విధానాలు మొదలైన వాటిల్లో శిక్షణనిస్తోంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో సీవోఆర్‌డీఈటీ 363 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. వీటి ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి మహిళలు సహా 26,137 మంది రైతులు ప్రయోజనం పొందారు. ఫూల్‌పూర్ మరియు కలోల్‌లోని సాయిల్ టెస్టింగ్ ల్యాబరేటరీల ద్వారా రైతులకు ఉచితంగా నేల పరీక్షల సదుపాయాలను కూడా సీవోఆర్‌డీఈటీ అందిస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సీవోఆర్‌డీఈటీ కీలక పోషకాల కోసం 95,706 నమూనాలను, మరియు సూక్ష్మపోషకాల కోసం 1,27,740 మూలకాలను విశ్లేషించింది.
అధునాతన వ్యవసాయ సాంకేతికతలపై సీవోఆర్‌డీఈటీ సాగు క్షేత్రాల్లో 25 ప్రదర్శనలు నిర్వహించింది.
సీవోఆర్‌డీఈటీ ఫూల్‌పూర్ ప్లాంటులో 1,800 ఎంటీ పశువుల దాణా మరియు 2,008 లీటర్ల వేప నూనె ఉత్పత్తి చేయబడింది.
దేశవాళీ జాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఫూల్‌పూర్లో 72,258.50 లీటర్ల ఆవు పాలు సేకరించబడ్డాయి.
దత్తతు తీసుకున్న గ్రామాల్లో సమీకృత గ్రామీణాభివృద్ధి పథకం (ఐఆర్‌డీపీ) అమలు చేయబడింది. కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణం, తాగు నీటి సౌకర్యాల ఏర్పాటు, మొక్కలు నాటడం, నేల పరీక్షల ప్రచార కార్యక్రమాలు, పశువుల దాణా సరఫరా, వర్మికంపోస్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం, మినీ-కిట్ పంపిణీ (సీఐపీ) మొదలైనవి ఈ గ్రామాల్లో చేపట్టబడ్డాయి. 2018-19లో వివిధ అంశాల్లో 255 పైగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.