Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
 A Testament <br/> to the Cooperative Model

సహకార స్ఫూర్తికి
నిదర్శనం

మల్టీ యూనిట్ సహకార సంఘంగా 1967 నవంబర్ 3న ఇఫ్కో రిజిస్టర్ అయ్యింది. గడిచిన 53 ఏళ్లలో, ఒకవైపు భారతదేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు సాధికారత కల్పించాలన్న లక్ష్య సాధన కోసం పాటుపడుతూనే మరోవైపు దేశంలోనే అత్యంత విజయవంతమైన సహకార సంఘాల్లో ఒకటిగా ఇఫ్కో ఎదిగింది. పురోగతికి, శ్రేయస్సుకు సహాకార విధానమే సరైన చుక్కాని కాగలదని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము.
సహకార విధానం ఎలా పనిచేస్తుంది?
సంయుక్త యాజమాన్య హక్కులు కలిగి ఉండి, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలు, ఆకాంక్షలు సాధించుకునేందుకు కొందరు వ్యక్తులు స్వచ్ఛందంగా ఒకే తాటిపైకి వచ్చి, ఏర్పాటు చేసుకున్న స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను సహకార సంఘంగా ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఏ) నిర్వచిస్తోంది.
(మూలం: ICA)
స్థూలంగా చెప్పాలంటే సహకార విధానంలో, ఒక సంస్థలో పని చేసే వారే దానికి యజమానులుగా కూడా ఉంటారు. లాభాల పంపకం, యాజమాన్యంలో వాటాలు, ప్రయోజనాల పంపకం వంటి ఆరోగ్యకరమైన వ్యవస్థను సృష్టించడం, ప్రధాన లక్ష్యాలకు భంగం కలగకుండా ఈ విధానం పెట్టుబడిదారీ ధోరణులపరమైన యథాతథ స్థితికి సవాలు విసురుతుంది. సహకార విధానమనేది కేవలం లాభాలు అందించడమే కాదు యావత్ సమాజమూ పురోగమించేందుకు తోడ్పడుతుంది.
భారత్‌లో సహకార విధానం
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే భారతదేశంలో ఆధునిక సహకార విధానం ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, దీని మూలాలు ప్రాచీన భారతీయ గ్రంథాల్లోనూ కనిపిస్తాయి. ‘మహా ఉపనిషద్’లో ప్రస్తావించిన సంస్కృత శ్లోకం “ప్రపంచమంతా ఒకే కుటుంబం” అని చాటి చెబుతోంది. భారతీయుల జీవన విధానంలోనే సహకార నమూనా ఒక భాగంగా ఉంటోంది. తరతరాలుగా వారసత్వంగా వస్తోంది.
India’s tryst with the cooperative model
భారతదేశంలో సహకార సంఘాలు

స్వాతంత్ర్యానంతరం పారిశ్రామిక విప్లవం దన్నుతో పురోగమించాలన్న బలీయమైన ఆకాంక్ష గల సరికొత్త భారత్ ఆవిర్భవించింది. ఈ సరికొత్త ఆకాంక్షలు దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత పటిష్టం చేశాయి. పంచవర్ష ప్రణాళికల్లో దాన్ని కూడా భాగంగా మార్చాయి.

1960ల నాటికి దేశంలో సహకార ఉద్యమం పటిష్టంగా వేళ్లూనుకుంది. వ్యవసాయం, పాడి, కన్జూమర్ ఉత్పత్తులు, ఆఖరికి పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ వ్యవస్థల్లోనూ పారిశ్రామిక దిగ్గజాలు ఈ విధానాన్ని పాటించడం ప్రారంభించాయి.

Pandit Jawaharlal Nehru

ఆర్థిక పురోగతి, అభివృద్ధి సాధించాలన్న తపన స్వతంత్ర భారతావనిని కొత్త ఉత్తేజంతో ఉరకలు వేయించింది. సహకార సంఘాలకు ప్రాధాన్యం పెరిగింది. 5 ఏళ్ల ఆర్థిక ప్రణాళికల్లో ఇవి కూడా భాగంగా మారాయి. తొలి పంచవర్ష ప్రణాళిక (1951-56) విజయవంతం కావడానికి ప్రణాళికల అమల్లో సహకార సంఘాలు కీలక పాత్ర పోషించడమే కారణమని చెబుతారు. ఆ విధంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఇవి ప్రత్యేక భాగంగా మారాయి.

పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశ తొలి ప్రధాన మంత్రి

Shri Deendayal Upadhyaya
భారతీయ జీవన విధానంలో సహకార భావననేది ఎంతో కీలకమైన, ప్రధానమైన అంశం. దీన్నే ఆధారంగా తీసుకుని, మనం మన ఆర్థిక విధానాలను పునర్నిర్మించుకోవాలి.

శ్రీ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ దార్శనికుడు

Award
ఏడు సహకార సూత్రాలు

Cooperative Information Officer : Ms Lipi Solanki, Email- coop@iffco.in