
రైతుల అభివృద్ధి కార్యక్రమం

నాణ్యమైన విత్తనాలు, శాస్త్రీయ వ్యవసాయ నిర్వహణ, ఎరువుల సమతూక వినియోగం గురించి రైతుల్లో అవగాహన కల్పించేందుకు కేవలం రెండు మడుల్లో చేపట్టిన ప్రదర్శన కార్యక్రమం ఆ తర్వాత భారీ ఉద్యమంగా మారింది. అప్పట్నుంచి 2,300 గ్రామాలు ఆకాంక్షలు మరియు సమృద్ధికి నిదర్శనాలుగా మార్చబడ్డాయి.

ప్రధానంగా నేల పరిస్థితిని మెరుగుపర్చడం, N:P:K వినియోగ నిష్పత్తిని మెరుగుపర్చేలా ఎరువులను సమతుల్యంగా మరియు సమీకృతంగా వాడటాన్ని ప్రోత్సహించడం, సెకండరీ మరియు సూక్ష్మ పోషకాలు అలాగే లేటెస్ట్ ఆగ్రో టెక్నాలజీ ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచేందుకు వివిధ రకాల ప్రమోషనల్ మరియు ఎక్స్టెన్షన్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. దిగుబడిని పెంచేందుకు ఎరువులను సమర్ధంగా వినియోగించుకోవడం, నీటిని సంరక్షించుకోవడం తద్వారా సుస్థిరమైన విధానాల్లో వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించడానికి ఇవి దోహదపడ్డాయి.

మట్టిని పునరుజ్జీవింపచేయడం, సుస్థిరమైన మరియు పర్యావరణ అనుకూల విధానాల కోసం పంట దిగుబడిని మెరుగుపర్చేందుకు మట్టిని సంరక్షించే కార్యక్రమం చేపట్టబడింది. దీనితో వివిధ రకాల పంటల దిగుబడులు సగటున 15-25 శాతం మెరుగుపడ్డాయి; నేల ఆరోగ్యం మెరుగుపడింది మరియు మెరుగైన సాగు విధానాల అమలుకు దోహదపడింది.

తర్వాత తరానికి విజ్ఞానం మరియు అనుభవాన్ని అందించే లక్ష్యంతో పేరొందిన పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు సహకార సంస్థల్లో ఇఫ్కో ప్రత్యేకంగా ‘ప్రొఫెసర్స్ చెయిర్స్’ను ఏర్పాటు చేసింది.