
-
కార్యకలాపం
కూరగాయలు శుద్ధి ప్రాజెక్టు
-
కార్పొరేట్ ఆఫీస్
న్యూఢిల్లీ
-
IFFCO's కలిగి ఉన్నవాట
40%
ఇఫ్కో, స్పెయిన్ కి చెందిన కాంజెలడోస్ డి నవర్రా (సిఎన్ కార్ప్) ల ఉమ్మడి భాగస్వామ్య కంపెనీ ‘‘సీఎన్ ఇఫ్కో ప్రైవేట్ లిమిటెడ్’’. దీనిని పంజాబ్ రాష్ట్రంలోని లుథియానా జిల్లాలో కూరగాయల శుద్ధి ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేస్తున్నారు. తొందరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులు, వృథా అయిపోవడాన్ని తగ్గించి రైతులకు అధిక ఆదాయన్ని అందించాలన్న ఉద్దేశంతో దీనిని నెలకొల్పుతున్నారు. ఇందులో ఇఫ్కో, సిఎన్ కార్ప్ లకు వరుసగా 40%, 60% వాటాలు ఉన్నాయి.
కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి, ఆతిథ్య పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ప్రభావితమైంది, ఇది IQF (ఇండివిడ్యువల్ క్విక్ ఫ్రీజింగ్) కూరగాయల ప్రధాన వినియోగదారు. ఉక్కు, సిమెంట్, ఇతర లోహాల ధరలు అనూహ్యంగా పెరగడంతోపాటు ప్రయాణాలు, నిర్మాణ కార్యకలాపాలపై తరచూ ఆంక్షలు విధించడం ప్రాజెక్టు పురోగతిని తీవ్రంగా ప్రభావితం చేసింది. అందువల్ల, CN IFFCO నిర్వహణ, ప్రాజెక్ట్ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది.