
గొప్పకథలన్నీ కూడా కష్టతరమైన సహసాలతోనే మొదలవుతాయి. 1975లో పట్టణ ప్రాంతానికి చెందిన ఒక మధ్య వయస్సు మహిళ వ్యవసాయాన్ని తన పూర్తి స్థాయి వృత్తిగా మార్చుకోవాలనుకున్నారు. ఆమె రోహతక్ కి 15 కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామంలో తన ప్రయత్నం మొదలుపెట్టారు.
గ్రామస్థులు మొదట్లో ఆమె ఆసక్తికి చూసి వేళాకోళం ఆడారు. అదేదో కాలక్షేపం కోసం చేస్తున్న ప్రయత్నం అన్నారు. కానీ ఆమె అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఏయేటికాయేడు అధిక వ్యవసాయ దిగుబడులను సాధిస్తూ శ్రీమతి కైలాస్ పన్వర్, ఆ జిల్లాలోని ప్రముఖ రైతులను ఆశ్చర్యపరిచారు. ఆమె మాత్రం ఈ విషయంలో ఇఫ్కోను పొగుడుతారు. ప్రతి దశలోనూ తనకు వెన్నుదన్నుగా నిలిచిందని చెబుతారు.

రాజస్థాన్ ని తాకత్ పూర్, గురాండీలో ప్రతియేటా పంటలు దెబ్బతింటుండటంతో తమ అదృష్టాన్ని నిందించసాగారు. భారతదేశం గ్రీన్ రివల్యూషన్ కి సాక్షిగా నిలిచినప్పుడు, ఈగ్రామాలు తీవ్రమైన వెనుకబాటుతనంలో ఉన్నాయి. ఇఫ్కో ఆ గ్రామాలను దత్త తీసుకుంది, దాంతో అక్కడ మార్పు ప్రయాణం మొదలైంది.
మొదట్లో గ్రామస్థులు, వాళ్ల సహాయం తీసుకోవడానికి కాస్త భయపడ్డారు. ఇఫ్కో, ఉదాహరణలు తెలియజేస్తు కొన్ని డిమానిష్ట్రేషన్ పాట్లు ఏర్పాటు చేసింది. చివరకు గ్రామస్థులు ఇఫ్కో మిషన్ లో చేరారు. ఇప్పుడు అవి మోడల్ విజేస్ గా వెలుగొందుతున్నాయి.



అస్సోం లోని లఖనబంధ గ్రామంలో భూములు సారవంతమైనప్పటికీ అక్కడ ప్రజలు మంచి అవకాశాల కోసం అంటూ పట్టణాలకు వలస వెళ్లిపోయారు. అప్పుడు కొంత మంది ఇఫ్కోను సంప్రదించారు. ఒక హెక్టార్ లొ ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు, అలా మొదలైన ప్రయాణంతో పనికిరాని ఖాళీ భూములు కాస్తా... పుచ్చకాయ పాదులతో నిండిపోయాయి!
ప్రయోగాత్మకంగా చేపట్టిన పుచ్చకాయల సాగు విజయవంతం కావడంతో, ఇతర సంప్రదాయేతర పంటల్ని పండించడం మొదలుపెట్టారు. నిరుపయోగంగా పడి ఉన్న భూమి.. సారవంతమైన గొప్ప సాగు భూమిగా మార్చేసిన ఇఫ్కోకి ఆ గ్రామస్థులు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
