
భారతదేశంలో సహకారోద్యమానికి ఆద్యులుగా నిల్చిన వారి కృషిని గుర్తిస్తూ, వారిని స్మరించుకునేలా 1982-83 మరియు 1993-94లో ఇఫ్కో ప్రతిష్టాత్మక ‘సహకారిత రత్న’ మరియు ‘సహకారిత బంధు’ పురస్కారాలను నెలకొల్పింది. సహకారోద్యమ భావజాలాన్ని విస్తృతం చేయడంలో సహకారోద్యమాన్ని పటిష్టం చేయడంలోను అసమాన కృషి చేస్తున్న ప్రముఖ సహకారోద్యమకారులకు ఈ పురస్కారాలు అందిస్తోంది.
ఈ పురస్కారాల్లో ఒక్కోదానికి రూ. 11 లక్షల నగదు, ప్రశంసాపత్రం ఉంటాయి. దేశీయంగా సాధారణంగా నవంబరు 14 నుంచి 20 వరకూ నిర్వహించే సహకార వారోత్సవాల సందర్భంగా జరిపే కార్యక్రమంలో ఇఫ్కో ఏటా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తోంది.
రాష్ట్ర సహకార సంఘాల యూనియన్లు, నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు ఇఫ్కో బోర్డు డైరెక్టర్ల బోర్డుల నుంచి పురస్కారాలకు సిఫార్సులు వస్తాయి. నామినేషన్లను వడపోసేందుకు, డైరెక్టర్ల బోర్డుతో ఒక ఉప-గ్రూప్ ఏర్పాటు చేయబడుతుంది. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసేందుకు ఇది డైరెక్టర్ల బోర్డుకు సిఫార్సులు చేస్తుంది.
Sప్రారంభమైనప్పటి నుంచి 35 మంది పైగా ప్రముఖ సహకారోద్యమకారులకు ప్రతిష్టాత్మక ‘సహకారిత రత్న’ అవార్డు, 26 మంది సహకారోద్యమకారులకు ప్రతిష్టాత్మక ‘సహకారిత బంధు’ పురస్కారాల ప్రదానం జరిగింది.

జవహర్ లాల్ నెహ్రు జాపకార్ధం ప్రారంభమైంది

సహకార సంఘాలకు దేశాన్ని నిర్మించే సత్తా ఉందని పండిట్ నెహ్రు బలంగా నమ్మారు. ఈ సహకార సంఘాలను బలోపేతం చేస్తే వివిధ వర్గాలు సామాజికంగా, అర్ధికంగా అభివృద్ధి చెందడానికి భిన్న రూపాల్లో తోడ్పడతాయన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఈ స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేశారు.
దీనిని ప్రారంభించినప్పటి నుంచి ప్రతియేటా దేశం మొత్తం ప్రభావితం చేయలిగే వ్యక్తులు అంటే డా. దేశమండ్ ఎం. టుటు, డా. పి.జె. కురియన్, డా. ఎ.పి.జె. కలాం లాంటి గొప్పవాళ్లు ఉపన్యాసాలు ఇచ్చారు.