
36,000 మంది సభ్యులు ఉన్న సహకార సంఘాలను నడిపించడం కష్టమైన పనే. అదే సమయంలో నాయత్వం వహించే అవకాశం దక్కుతుంది. మా ఉద్యోగుల, సహచరుల, వినియోగదారుల ఆకాంక్షలను సంతృప్తి పరిస్తే సరిపోదని మేం నమ్ముతున్నాం. వాళ్లలో స్ఫూర్తిని రగిలించే పనులు చేయాలి. ఇఫ్కో విజయం సాధించిందంటే, మా భాగస్వాములందరూ గెలిచినట్టే. అన్నింటికంటే ముఖ్యంగా ఐకమత్యమే విజయం సాధిస్తుంది.

గత 51 సంవత్సరాలుగా, ఎరువుల తయారీలో గొప్ప సంస్ధగా ఇఫ్కో గుర్తింపు పొందింది. అదొక్కటే కాదు, ఇంకా అనేక రకాల ప్రశంసల్ని దక్కించుకున్న గర్వాన్ని సొంతం చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ, స్వావలంబన, ఉద్యోగల కోసం సురక్షితమైన పని వాతావరణం, హెచ్ ఆర్ విధానం, శక్తి వినియోగం, కర్బన్ ఉద్గారాలను తగ్గించడం, భారతీయ రైతుల్లో ఐటి సామర్ధ్యం పెంచడం, అర్థిక అభివృద్ధి వంటి అనేక అంశాల్లో ఇఫ్కో చేస్తున్న కృషికి ప్రశంసలు అందుతున్నాయి.

ఇఫ్కోకి దక్కిన ప్రశంసల జాబితా
- అంతర్జాతీయ ఫెర్టిలైజర్ అసోసియేషన్ అవార్డులు
- ఫెర్టిలైజర్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా అవార్డులు
- ఐబిఎం అవార్డులు
- గ్రీన్ టెన్ ఎన్విరానమెంట్ ఎక్స్ లెన్సీ అవార్డు
- సీఐఐ ఎన్విరామెంట్ బెస్ట్ ప్రాక్టిసెస్ అవార్డులు
- కూప్ గ్లోబెల్ అవార్డ్స్ ఫర్ కోపరేటివ్ ఎక్స్ లెన్సీ
- నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
- పీఆర్ఎస్ఐ అవార్డులు