Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...

ఇఫ్కో ఉత్పాదక యూనిట్

కాండ్లా, గుజరాత్

kandla kandla

ఇఫ్కో మొదటి ప్లాంట్

కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి ఇఫ్కో మొట్టమొదటి యూనిట్ ను కాండ్లలో నెలకొల్పారు. ఇది 1974లో ఉత్పత్తి ప్రారంభించింది. మొదట్లో 10:26:26, 12:32:16 గ్రేడ్ల ఎన్ పికె ఉత్పాదక సామర్ధ్యం 1,27,000 ఎంటిపిఎ (పి205) గా ఉండేది. గడిచిన నాలుగు దశాబ్దాల్లో, కర్బన ఉద్గారాలను తక్కువ మోతాదులో వెలువరిస్తూ ఉత్పాదక సామర్ధ్యాన్ని అనేక రెట్లు పెంచుకోవడానికి సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కాండ్లా యూనిట్ ఆదర్శప్రాయంగా నిలిచింది. ఇక్కడ అత్యంత కీలకమైన ఆర్ అండ్ డి ల్యాబ్ విన్నూతంగా నీటిలో కరిగే ఎరువుల తయారీలో విజయం సాధించింది. ప్రస్తుతం కాండ్లా యూనిట్ వార్షిక ఉత్పాదకత 9,16,600 మెట్రిక్ టన్నులు (P2O5). దీంతోపాటుగా డిఎపి, ఎన్ పికె, జింక్ సల్ఫేట్ మోనో హైడ్రేట్ వంటి అనేక కాంప్లెక్స్ ఎరువులు, నీటిలో కరిగిపోయే యూరియా పాస్పేట్, 19:19:19,18:18:18 వంటివి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి.

ట్రైన్ ఎ, బి లు 28 నవంబర్ 1974న పూర్తి స్థాయి సామర్ధ్యం 1,27,00 ఎంటిపిఏ(P2O5)తో ప్రారంభమయ్యాయి. ఇక్కడ 10:26:26 & 12:32:16 గ్రేడ్ ల ఎన్ పికే ఉత్పత్తి అవుతుంది. ఎ/ ఎస్ డొర్ర ఒలివర్ ఇంక్ యూఎస్ఎ నుంచి టెక్నాలజీ లైసెన్సు పొందారు.

Year 1974

సామర్ధ్యాన్ని పెంచే ప్రాజెక్టును అమలు చేసి 4 జూన్ 1981న పూర్తి చేశారు. షెడ్యూల్ కంటే ఒక నెల ముందే పూర్తి చేశారు. ఎ/ ఎస్ హిందుస్తాన్ డొర్ర ఒలివర్, ఇండియా నుంచి టెక్నాలజీ లైసెన్స్ తీసుకుని ప్లాంట్ ఉత్పాదక సామర్ధ్యాన్ని పెంచే విస్తరణ కార్యక్రమం చేపట్టారు. దీని ప్రకారం 10:26:26 & 12:32:16 గ్రేడుల ఎన్ పికే, డిఏపీ, P2O5 ఉత్పాదక సామర్ధ్యం 3,09,000 MTPD కి పెరిగింది.

Year 1981

సామర్ధ్యాన్ని పెంచే రెండో ప్రాజెక్టును జులై 1999న పూర్తి చేశారు. అనుకన్నదాని కంటే కొన్ని రోజుల ముందే ఇది పూర్తయింది. ప్రాజెక్టులో భాగంగా ప్రొడక్షన్ యూనిట్ లో అదనంగా ట్రైన్ ఈ, ఎఫ్ లు చేరాయి. P2O5 ఉత్పాదక సామర్ధ్యం 5,19,700 టిపిఎ కి చేరింది.

Year 1999

ఏడాది మొత్తం మీద ఉత్పత్తి జరిగే రోజుల సంఖ్య పెంచేలా టెక్నాలజీని అప్ గ్రేడ్ చేశారు. అంతకు ముందు ఏడాదిలో 250 రోజులపాటు జరిగే ఉత్ప్తత్తిని 315 రోజులకు పెంచేలా లైసెన్సులు పొందారు. దీంతో P2O5 ఉత్పాదక సామర్ధ్యం 9,10,000 టన్నులకు పెరిగింది.

Year 2000-04

ఏడాదికి 15,000 మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్ధ్యం ఉన్న యూరియా పాస్పేట్ ప్లాంట్ ను మార్చి6, 2011న ప్రారంభించారు. దీంతో, దేశంలోనే మొట్టమొదటిగా, నీటిలో కరిగిపోయే ఎరువులు తయారు చేసే యూనిట్ గా కాండ్లా రికార్డు సృష్టించింది.

Year 2011

జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ ప్లాంట్ మార్చి1, 2012న ఉత్పత్తి ప్రారంభించింది. అప్పట్లో దీని ఉత్పాదక సామర్థ్యం 30,000 ఎంటిపిఏ. భారతీయ నెలల్లో పెద్ద ఎత్తున్న ఉన్న జింక్ లోపాన్ని పరిష్కరించడం కోసం అవిష్కరించిన గొప్ప ఉత్పత్తి ఇది.

Year 2012

నీళ్లలో కరిగిపోయే కొత్త ఎరువులు 19:19:19 ఉత్పత్తి అంతర్గతంగా మొదలైంది.

Year 2018-2019
kandla

ఇఫ్కో కాండ్ల ఉత్పత్తి సామర్ధ్యం

ఉత్పత్తి పేరు వార్షిక ఉత్పాదక
సామర్ధ్యం(ఎంటిపిఎ)
టెక్నాలజీ
ఎన్ పికె 10:26:26 5,15,400.000 ఎ, బి, సి, డి స్ట్రిమ్ లకు టిఎవి కన్వెన్షనల్ గ్రాన్యువల్ ప్రోసెస్ ఉయోగిస్తున్నారు. అదనపు స్ట్రిమ్ లైన ఈ, ఎఫ్ లకు డ్యూయల్ పైప్ రియాక్టర్ గ్రానువల్ ప్రోసెస్ టెక్నాలజీ వాడుతున్నారు.
ఎన్ పికె 12:32:16 7,00,000.000
డిఎపి 18:46:00 12,00,000.000
యూరియా పాస్పేట్ 17:44:00 15,000.000  
పాస్పెట్ పోషకాలతో కూడిన ఎన్ పికె ఉత్పత్తులు  
జింక్ సల్ఫేట్ మోనో 30,000.000  
మొత్తం 24,60,400.000  

ఉత్పత్తి వివరాలు

ప్లాంట్ హెడ్

Mr. O P Dayama

శ్రీ ఒ పి దయామ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)

శ్రీ ఒ పి దయామ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ప్రస్తుతం ఆయన కాండ్లా యూనిట్ హెడ్ గా పనిచేస్తున్నారు. దయామా కెమికల్ ఇంజినీరింగ్ లో బి.ఇ. చేశారు. ఇఫ్కో పల్పూర్ యూనిట్ లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ గా కెరియర్ ప్రారంభించారు. ఇఫ్కోలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన, వివిధ ప్రాజెక్టుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పల్పూర్, కలోల్ ప్లాంట్ల ప్రారంభంలో, కార్యకలాపా నిర్వహణలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన తన అనుభవాన్ని ఇఫ్కో విదేశీ వెంచర్ ఒఎంఐఎఫ్ సివో, ఒమెన్ కోసం కూడా ఉపయోగించారు.

kd1
kd3
kd4
kd5
kd7
kd9
kd11
kd12
kd13
kd14
kd18
kd35
kd36
kd63

అనుమతి రిపోర్టులు

ఏప్రిల్-24 నుండి సెప్టెంబరు-24 వరకు అర్ధ వార్షిక వర్తింపు నివేదిక

అక్టోబర్-23 నుండి మార్చి-24 వరకు అర్ధ వార్షిక వర్తింపు నివేదిక

ఏప్రిల్-23 నుండి సెప్టెంబర్-23 వరకు అర్ధ వార్షిక వర్తింపు నివేదిక

అక్టోబర్-22 నుండి మార్చి-23 వరకు అర్ధ వార్షిక వర్తింపు నివేదిక

అర్ధసంవత్సరం అనుమతి రిపోర్టు ఏప్రిల్-22 నుంచి సెప్టెంబర్-22 వరకు

అక్టోబర్-21 నుండి మార్చి-22 వరకు అర్ధ వార్షిక సమ్మతి స్థితి నివేదిక

అర్ధసంవత్సరం అనుమతి రిపోర్టు ఏప్రిల్-21 నుంచి సెప్టెంబర్-21 వరకు

అర్ధసంవత్సరం అనుమతి రిపోర్టులు జూన్-21

2021-06