
భారతీయ ఎరువుల పరిశ్రమకు మార్గదర్శకులు
డా. ఉదయ్ శంకర్ అవస్థి 1993లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సహకార వ్యవస్థలో ఒక సరికొత్త శకానికి నాంది పలికారు.
డా. యు.ఎస్. అవస్థి

మార్పుకు దూత


అసలైన దార్శినికుడు డా. అవస్థి, ఇఫ్కో అభివృద్ధిలో ఆయనే కీలకం. ఆధునిక టెక్నాలజీని, సంప్రదాయ విధానాలతో కలగలపడం ఎలాగో తెలిసి గొప్ప వ్యక్తి. ఆయన నాయకత్వంలో ఇఫ్కో ఉత్పాదన సామర్ద్యం 292 శాతం పెరిగి ఏడాదికి 75.86 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. నికర విలువ 688 శాతం పెరిగి 6510 కోట్లు అయింది. టర్నోవర్ 2095 శాతం పెరిగి 20846 కోట్లు అయింది. ఇదంతా కూడా 20 సంవత్సరాలు(1992-2013-14)లోనే జరిగింది.

ప్రజల సీఈవో గా పేరొందిన డా. అవస్థి మనుషుల నమ్మకం చాలా బలమైనంది విశ్వసిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయికి చేరవేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే ఆధుని అర్ధిక విధానాలను రైతుల ముంగిటికి తీసుకెళ్తున్నారు. కాబట్టి రైతులు అనేక లాభదాయక, లాభాపేక్ష లేని సంస్ధల ద్వారా తమ ఉత్పత్తులకు తగిన ఫలితాన్ని పొందుతున్నారు.
ఇఫ్కో ఆధునికీకరణ ప్రక్రియ
వృతినైపుణ్యం, పారదర్శకత కోసం చొరవ
ప్రపంచం ప్రసిద్ధి చెందిన స్థాయిలో వృత్తినైపుణ్య నిర్వహణ, సహకార వ్యవస్థ ల సమ్మిళితంగా పారదర్శకతను తీసుకురావడానికి డా. అవస్థి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని వ్యవస్థలను ఒక క్రమపద్ధతిలోకి తీసుకురావటం మొదలుపెట్టారు. అవి పారదర్శకత, స్వయం స్వావలంబనతో ఉండేలా తీర్చిదిద్దారు.
ఉత్పాదక సామర్ధ్యం పెంచడం
సంస్కరణల యుగంలో పోటీతత్వంతో నిలబడటం కోసం, ఉత్పాదక సామర్ధ్యం పెంచడం మీద దృష్టిపెట్టి విజన్ 2020 డాక్యుమెంట్ ను డా. అవస్థి తయారు చేశారు. ఇంధనాన్ని అదా చేసే యూనిట్ల ప్రారంభానికి చొరవ తీసుకున్నారు. యూరియా ప్లాంట్లను ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి నాఫ్తా మీద ఆధాపడిన వాటిని గ్యాస్ అధారిత యూనిట్లుగా మార్చారు. నిర్వహణ సామర్ధ్యాన్ని అద్భుతంగా పెంచారు, వాటిని అంతర్జాతీయ ప్రమాణాల కంటే ఇంకా పైకి తీసుకెళ్లారు.
వ్యాపారాన్ని బహుముఖంగా విస్తరించడం
డా. అవస్థి నాయకత్వంలో ఇఫ్కో అనేక వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. జాతీయ, అంతర్జాతీ స్థాయిలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టింది. ఆయన హాయంలోనే ఇఫ్కో అనేక లాభాపేక్ష సంస్థలను ఏర్పాటు చేసింది. మొత్తంగా చూస్తే మెరుగైన సమాజం కోసం, నిరుపేదల జీవన ప్రమాణా పెంచడం కోసం వీటిని ఏర్పాటు చేశారు.
ఏ ఏ రంగాల్లో ఇఫ్కో కార్యాకలాపాలు ఉన్నాయంటే
-
ఎరువులు
-
సాధారణ బీమా
-
సరుకు రవాణ
-
కిసాన్ సెజ్
-
గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర వ్యాపారం
-
ఆన్ లైన్ మల్టీ కమోడిటి ఎక్స్ ఛేంజ్
-
గ్రామీణ టెలికామ్
-
సేంద్రియ వ్యవసాయ పెట్టుబడి
-
గ్రామీణ సూక్ష్మరుణ వ్యవస్థ
-
శీతలీకరణ ఆహారపదార్ధాలు
-
వ్యవసాయ రసాయనాలు

ప్రపంచపటంలో ఇఫ్కో కి స్థానం
ఇఫ్కో ని ప్రపంచపటంలో నిలబెట్టాలన్న డా. అవస్థి దూరదృష్టి, పట్టుదల కారణంగా ఒమన్, జోర్డాన్, దుబాయ్ వంటి దేశాల్లో ఎరువులు కాకుండా ఇతర రంగల్లోనూ జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేశారు.

ప్రజల సీఈవో
అవస్థి సాధించిన అసలు విజయం రైతుల్లో నమ్మకం కలిగే చేయడం. ఆయన హాయంలో సభ్యుల సంఖ్య 5.5 కోట్లకు చేరింది. 36,000 సహకార సంస్థలకు చెందిన రైతులు ఇఫ్కో ను ప్రపంచంలోనే అతిపెద్ద సహకార సంఘం గా మార్చారు. గ్రామీణ భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఈ పేరు వినిపిస్తుంది.

సాధారణంగా విశ్లేషణాత్మక, వివేకవంతమైన ఆలోచనతో ఉండే డా. అవస్థి కి లలిత కళల మీద కూడా మక్కువ ఎక్కువే. భారతదేశానికి చెందిన అపురూప కళాఖండాలను భద్రపరిచేందుకు ఇఫ్కోలో ఒక కళా నిధి లాంటిది ఏర్పాటు చేశారు. భారతీయ సాహిత్యాన్నిప్రోత్సహించేందుకు ఒక అవార్డును ఏర్పాటు చేశారు. ఆయన ఇఫ్కో సీఈవోగా కొనసాగుతూనే భారతదేశంలో సహకార ఉద్యమాలకు బలమైన మద్దతునిచ్చారు.
ఇఫ్కో వ్యవస్థాపక పితామహులు
అసలైన మార్గదర్శకులు షా. పాల్ పోతేన్, ఇఫ్కో ను ఏర్పాటు చేశారు, దానికి తొలి మేనెజింగ్ డైరెక్టర్ ఆయనే.
(1916-2004)

భారతీయ ఎరువుల పరిశ్రమకు మార్గదర్శకులు
జనవరి 8, 1916లో జన్మించిన షా. పాల్ పోతేన్ మద్రాస్ యూనివర్శటీ నుంచి 1935 లో డిగ్రీ పట్టా పొందారు. 1940లో మైసూర్ యూనివర్శిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కెనడాలోని కొలంబియా ప్లాన్ 1965-66 ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కోర్స్ చేశారు.
ఒక పారిశ్రామికవేత్త, భారతీయ ఎరువుల పరిశ్రమకు మార్గదర్శకుడు షా. పాల్ పోతేన్. భారతదేశంలో మూడు భారీ స్థాయి ఎరువుల తయారీ యూనిట్లను స్థాపించి, నడిపించారు. షా. పోతేన్ తన కెరియర్ ను ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్(ఎఫ్ఎసిటి)లో సీనియర్ మేనేజర్ స్థాయిలో 1944లో ప్రారంభించారు. ఎఫ్ఏసిటి ఇంజినీరింగ్ అండ్ డిజైన్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఇడివో)ను 1965లో ఏర్పాటు చేసి దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. మూడేళ్ల తర్వాత ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేటివ్ ( ఇఫ్కో)లో వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు.
షా పాల్, ఇఫ్కో అభివృద్ధికి బలమైన పునాది వేశారు. సహకార వ్యవస్థకు సంబంధించి మూల విలువలు, సిద్ధాంతాలు రూపొందించారు. వాటి ప్రకారం రైతుల పురోగతే ఇక్కడ ప్రధాన అంశం అయింది. భారతదేశ వ్యవసాయ రంగం రూపురేఖలు మార్చేందుకు చేసిన కృషికిగాను, దేశంలో నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పదశ్రీ ఆయనకు దక్కింది.

షా. పాల్ పోతేన్ ను ఇఫ్కో గుర్తుంచుకున్న తీరు
షా. పాల్ పోతేన్ పట్ల తమ ప్రమను, అభిమానాన్ని చాటుకోవడం కోసం, ఇఫ్కో కుటుంబం ఒనల్ లోని టౌన్ షిప్ కి ‘పాల్ పోతేన్ నగర్’ అని పేరు పెట్టంది. ఇఫ్కోకి, సమాజానికి ఆయన చేసిన అసమానమైన సేవలు ఎప్పటికీ నిలిచిపోయేలా చేసే నిర్ణయం ఇది.
రైతులతో మాట్లాడుతున్న షా. పాల్ పోతేన్
తొలిరోజుల్లో షా. పాల్ పోతేన్ రైతులతో ముచ్చటిస్తున్నప్పుడు తీసిన ఫొటో.

తన కెరియర్ లో షా. పాల్ పోతేన్ ఎన్నో పరిశోధనా వ్యాసాలు, టెక్నికల్ పేపర్లు రాశారు. వాటిని నిపుణుల కమిటీకి పంపించారు. ఆయనకు ఆర్కియాలజీ, ఆర్కిటెక్చర్, చరిత్ర, సాహిత్యం, క్రీడల మీద ఆసక్తి ఉండేది.