
-
కార్యకలాపాలు
వ్యవసాయ ముడి ఉత్పత్తులు & సేంద్రియ వ్యవసాయం
-
కార్పొరేట్ కార్యాలయం
న్యూఢిల్లీ
-
IFFCO's వాటాలు
51%
IFFCO (51 శాతం), సిక్కిం ప్రభుత్వం (49 శాతం) 2018లో సిక్కిం ఇఫ్కో ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎస్ఐవోఎల్)ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. భారత్‌లోనే తొలి సేంద్రియ రాష్ట్రంగా ప్రకటించబడిన సిక్కింలోని సేంద్రియ ఉత్పత్తులకు విలువను జోడించేందుకు, ప్రమోట్ చేసేందుకు మరియు మార్కెటింగ్ చేసేందుకు దీన్ని నెలకొల్పాయి.రైతులకు వ్యవసాయ ముడి ఉత్పత్తులు లభించడంలో తోడ్పాటు అందించడంతో పాటు రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపర్చేందుకు ఎస్ఐవోఎల్ కృషి చేస్తోంది.
విలువ జోడింపు కోసం ఎంపిక చేసిన తొలి నాలుగు ఉత్పత్తుల్లో – అల్లం, పసుపు, కూట్టు, పెద్ద యాలకులు ఉన్నాయి. ఈ పోర్ట్‌ఫోలియోకు మరిన్ని ఉత్పత్తులను జోడించాలని అలాగే సేంద్రియ ఉద్యమం ఊపందుకుంటున్న ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా కార్యకలాపాలు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. .
సేంద్రియ ఉత్పత్తులను ప్రక్రియవిధానం కోసం, సిక్కింలోని రంగ్‌పోలో రెండు ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ సౌకర్యాలు అందించే విభాగాలు త్వరలో పూర్తి కానున్నాయి.