BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.

Listening voice...


సీ సీక్రెట్ (ఎదుగుదలను పెంచుతుంది & ఒత్తిడిని నిరోధిస్తుంది) – 500 గ్రా.
హిందూ మహాసముద్రంలో పెరిగే ఎర్రని & గోధుమ రంగు సముద్ర నాచు నుంచి వెలికితీసిన పోషకాలు సీ సీక్రెట్ గుళికల్లో పుష్కలంగా ఉన్నాయి. ఈ నాచు పెంపక ప్రక్రియ మత్స్యకారుల కుటుంబాలకు ప్రధాన జీవనోపాధి మార్గంగా ఉంటోంది.
సముద్రనాచు నుంచి తీసిన పోషకాలు మొక్కల ఎదుగుదలను పెంపొందించడంతో పాటు ఒత్తిడిని తట్టుగలిగే సామర్థ్యాలను కూడా పెంచుతున్నాయి. వీటిలో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, అసేంద్రియ లవణాలు & ఇంకా ఇతరత్రా పోషకాలు, విటమిన్లు, మొక్కల ఎదుగుదలను పెంచే ఆక్సిన్లు, సైటోకినిన్‌లు మరియు గిబ్బరెలిన్లు, గ్లైసిన్-బెటెయిన్, కోలీన్ వంటి హార్మోన్లు ఉంటాయి.
సమ్మేళనం:
సముద్రనాచు, క్యాల్షియం, సల్ఫర్ మరియు సంకలితాలు
ఉపయోగించడానికి సూచనలు:
- ఒకో కుండీకి 25-30 గ్రాముల గుళికలను మట్టి పై భాగాన వేసి, చక్కగా కలపాలి
- అవసరాన్ని బట్టి మోక్కకు నీరు పెట్టాలి
- ప్రతి 15 రోజులకు ఒకసారి పునరావృతం చేయాలి

ప్రయోజనాలు:
- నేల నుంచి పోషకాలను గ్రహించే సామర్థ్యాలను మొక్కల్లో పెంచుతుంది
- మొక్కల సాగు & వేర్ల వృద్ధికి దోహదపడుతుంది
- మొక్కల్లో ఒత్తిడి & వ్యాధుల నిరోధక శక్తిని పెంచుతుంది
- మట్టిలో సూక్ష్మక్రిముల పెరుగుదలను పెంపొందిస్తుంది మరియు మట్టి నాణ్యతను మెరుగుపరుస్తుంది
- మొక్కల ఎదుగుదల మరియు అభివృద్ధి ప్రక్రియలకు ఊతమిస్తుంది


జాగ్రత్తలు:
- చల్లని మరియు పొడి ప్రదేశంలో ఉంచాలి
- పిల్లల చేతులకు అందకుండా ఉంచాలి
