
- పంటపొలాల్లో ఎరువులు మరియు క్రిమిసంహారకాలను పిచికారీ చేసేందుకు డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణనిచ్చేందుకు 2021 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకూ పది రోజుల వర్క్‌షాప్ నిర్వహించబడింది.
- ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ మరియు గుజరాత్‌కు చెందిన 36 మందికి గురుగ్రామ్‌లోని IFFCO ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇవ్వబడింది
న్యూఢిల్లీ, 2021 డిసెంబర్ 9: WOW గో గ్రీన్‌తో కలిసి ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై 2021 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 8 వరకూ పది రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహించింది. గురుగ్రామ్‌లోని ఫెర్టిలైజర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో (FMDI) ఈ శిక్షణ ఇవ్వబడింది. ఆధునిక వ్యవసాయంపై ఆసక్తి గల పురోగామి దేశీ మరియు విదేశీ రైతులకు శిక్షణనిచ్చేందుకు అత్యంత అధునాతనమైన సదుపాయాలతో 1982లో ఈ ప్రీమియర్ సంస్థ ఏర్పాటైంది. మొత్తం 36 మంది ప్రగతిశీల రైతులు, ఎంట్రప్రెన్యూర్లు, FPOలు, సహకార సంఘాలకు చెందిన వారు విజయవంతంగా ఈ శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు. వీరిలో ఢిల్లీ (1), హర్యానా (15 మంది), ఉత్తర్ ప్రదేశ్ (11 మంది), గుజరాత్ (9 మంది)కి చెందిన వారు ఉన్నారు.
IFFCO మేనేజింగ్ డైరెక్టర్ Dr. యూఎస్ అవస్థి ఈ శిక్షణా కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో రైతుల వ్యయాలు తగ్గడమే కాకుండా ఉత్పత్తి కూడా పెరుగుతుందని, తద్వారా ఈ శిక్షణ కార్యక్రమం రైతాంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. IFFCO మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్ కూడా కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ కార్యక్రమం ఒక కొత్త బాట ఏర్పర్చగలదని ఆయన చెప్పారు.
D10 రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నవారికి సమగ్రమైన క్లాస్‌రూం అలాగే డ్రోన్లపై ప్రాక్టికల్ శిక్షణనిచ్చారు. వ్యవసాయంలో డ్రోన్ల ఉపయోగాలు, వాటిని ఉపయోగించే తీరు, నిర్వహణ మొదలైన వాటి గురించి వివరించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రస్తావించిన కొన్ని ప్రధాన అంశాలు ఏమిటంటే:
- డ్రోన్ల పరిచయం, చరిత్ర, రకాలు, వాటి ఉపయోగాలు, భవిష్యత్ అవకాశాలు
- పౌర విమానయాన విభాగం DGCA నియంత్రణలు
- ఫ్లయిట్స్ ప్రాథమిక సూత్రాలు
- నో డ్రోన్ జోన్‌లపై అవగాహనతో ఎయిర్‌స్పేస్ స్ట్రక్చర్ మరియు ఎయిర్‌స్పేస్ పరిమితులు
- ఫ్లయిట్ ప్రణాళిక
- ఢీకొనడాన్ని నివారించే రేడియో టెలిఫోనీ (RT) టెక్నిక్‌లు ప్రామాణిక రేడియో పరిభాష,
- పేలోడ్ ఇన్‌స్టాలేషన్, మరియు వినియోగం మొదలైనవి
- ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్, ఫ్లయిట్ కంట్రోలర్స్
- డ్రోన్లను ఉపయోగించే తీరు, ఉపయోగాలు మొదలైనవి .
స్టిమ్యులేటర్లతో ప్రారంభమై క్రమంగా చిన్న డ్రోన్లు మరియు అంతిమంగా పూర్తి స్థాయి వ్యవసాయ డ్రోన్లతో శిక్షణ కొనసాగింది. గతంలో డ్రోన్‌ను కనీసం తాకని వారు అందరూ కూడా కేవలం కొద్ది రోజుల శిక్షణతోనే వాటిని అత్యంత సమర్ధంగా ఎగరవేయడం ప్రారంభించారు. అగ్రి-డ్రోన్లను ఉపయోగించండంలో విజయవంతంగా శిక్షణ పొందిన వారందరినీ “గ్రీన్ పైలట్లు”గా పేరొందారు. ఈ టెక్నాలజీని తమ వ్యవసాయ భూముల్లో ఉపయోగించడమే కాకుండా తమ తమ ప్రాంతాల్లో మిగతా రైతుల్లో వీటి గురించి అవగాహన పెంచుతామని అలాగే తమ పరిజ్ఞానాన్ని మిగతా వారికి పంచుతామని వారు ప్రతిజ్ఞ చేశారు.
వ్యసాయ డ్రోన్ల వినియోగంపై ఒక విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఉపయోగించడంలో రైతులకు శిక్షణనివ్వడం అత్యంత ప్రాధాన్యతాంశం. దీనివల్ల అధికారికంగా విధానాన్ని ప్రకటించిన వెంటనే ఈ టెక్నాలజీ అందరి ఆమోదాన్ని పొందేందుకు సాధ్యపడుతుంది. అగ్రి-డ్రోన్ 15 నిమిషాల ఫ్లయిట్ సమయంలో2.5 ఎకరాల స్థలంలో ఎరువును పిచికారీ చేయగలదు. ఆత్మనిర్భర్ కృషి మరియు ఆత్మనిర్భర్ భారత్‌ను దృష్టిలో ఉంచుకుని, 2025 నాటికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేయాలన్న గౌరవనీయ ప్రధాని లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా, సమర్ధమంతమైన విధంగా ఎరువుల వినియోగానికి ఊతమిచ్చేందుకు IFFCO ముందుకు వచ్చింది. IFFCO తలపెట్టిన ఈ శిక్షణా కార్యక్రమం, ఆధునిక వ్యవసాయం దిశగా భారత్‌ను నడిపేందుకు అవసరమైన ఆద్యులను తీర్చిదిద్దగలదు. /p>
FMDI సందర్శనలో భాగంగా గ్రీన్ పైలట్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో IFFCO కృషిని భారత ప్రభుత్వంలో భాగమైన కేంద్ర వ్యవసాయ శాఖ (ఎరువుల విభాగం) అండర్ సెక్రటరీ సచిన్ కుమార్ ప్రశంసించారు.
శిక్షణా కార్యక్రమం ముగింపు సందర్భంగా IFFCO JMD రాకేశ్ కపూర్ ప్రసంగించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం IFFCO మరియు WOW రూపొందించిన వ్యాపార విధానమనేది ఆచరణసాధ్యమైన విధానమని, మరియు విజయవంతమయ్యేందుకు అధిక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వ్యాపార కోణంలో చూడకుండా రైతులకు సేవ అందించే లక్ష్యంతో డ్రోన్లను ఉపయోగించాలని IFFCO మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్ ఈ సందర్భంగా గ్రీన్ పైలట్లకు విజ్ఞప్తి చేశారు.
IFFCO FMDI వేలకొద్దీ రైతులకి, వ్యవసాయంపై ఆసక్తి గల వారికి సాగుకు సంబంధించిన వివిధ అంశాల్లో శిక్షణనిస్తుంది. వందల సంఖ్యలో ట్రైనీలకు రెసిడెన్షియల్ సదుపాయాలు ఉన్న శిక్షణా సంస్థ ఇదొక్కటే. IFFCO మరియు ICAR వంటి ఇతర ప్రీమియర్ సంస్థల నుంచి నిపుణులు, శాస్త్రవేత్తలు దీన్ని తరచుగా సందర్శిస్తూ ఉంటారు. IFFCO కేవలం వ్యాపారం మాత్రమే కాదు. ఇది రైతులు నడిపించే, రైతుల గురించి, మరియు రైతుల కోసం నడిచే వ్యాపారం. దేశవ్యాప్తంగా విస్తృతమైన రైతాంగానికి సేవలు అందించేందుకు IFFCO అనుసరించే మార్గాల్లో FMDI కూడా ఒకానొకటి.