Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
IFFCO kick starts one of India’s largest nationwide tree plantation campaign IFFCO kick starts one of India’s largest nationwide tree plantation campaign

పత్రిక ప్రకటన

దేశవ్యాప్తంగా సంయుక్తంగా పరిశోధన, టెస్టింగ్ & ఎక్స్‌టెన్షన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించేందుకు ICARతో MoU కుదుర్చున్న IFFCO

దేశ రైతులకు సహయకరంగా ఉండేలా నవకల్పనలు మరియు సాంకేతికత బదలాయింపునకు ఊతం.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు దోహదపడే ప్రయత్నం.

ICAR ఇనిస్టిట్యూట్‌లు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల (KVKలు) ద్వారా వివిధ ఉత్పత్తులపై పరిశోధనలు, టెస్టింగ్ మరియు ధృవీకరణపై సంయుక్తంగా పని చేసేందుకు 2020 జూన్ 10న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. రైతులకు ప్రయోజనం కల్పించేలా ఈ కేంద్రాలు శిక్షణ కల్పించడం, అవగాహన కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు, ఫీల్డ్ ట్రయల్స్ మరియు ప్రదర్శనలు నిర్వహించడం మొదలైన వాటి ద్వారా సాంకేతిక పురోగతి అంశాలను ప్రచారంలోకి తెచ్చేందుకు ఈ ఒప్పందం తోడ్పడనుంది.

ఎంవోయూ గురించి DDG Dr. ఎ.కె. సింగ్ స్థూలంగా వివరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ కమిషనర్ Dr. మల్హోత్రా; ATARIల డైరెక్టర్, ADG (Cdn.), Dr. కిమోతీ; KVKల ప్రతినిధుల సమక్షంలో సెషన్‌కు నేతృత్వం వహించాల్సిందిగా DARE కార్యదర్శి & DG ICAR Dr. టి. మహాపాత్రకు స్వాగతం పలికారు. సహ-చైర్మన్‌గా వ్యవహరించాల్సిందిగా IFFCO మేనేజింగ్ డైరెక్టర్ Dr. యూ. ఎస్. అవస్థిని ఆహ్వానించారు.

గతంలో ఎన్నడూ లేనంత వేగవంతంగా వినూత్న ఉత్పత్తుల టెస్టింగ్, ధృవీకరణ, ప్రచారానికి ఎంవోయూ దోహదపడగలదని, దీనితో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ యోగేంద్ర కుమార్ తెలిపారు. ICARతో చర్చల తర్వాత త్వరలోనే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇది ఒక చారిత్రక ఘట్టమని సెషన్‌కు నేతృత్వం వహించిన DARE కార్యదర్శి & ICAR DG Dr. టి. మహాపాత్ర వ్యాఖ్యానించారు. సంయుక్త పరిశోధనలు, విస్తరణతో ఎరువుల వినియోగం కనీసం 15 శాతం తగ్గినా, గణనీయంగా ప్రయోజనం చేకూరినట్లే భావించవచ్చని ఆయన తెలిపారు.

వ్యవసాయ రంగంలో అద్భుతమైన లక్ష్యాలు సాధించిందని ICARని ఈ సందర్భంగా IFFCO మేనేజింగ్ డైరెక్టర్ Dr. యూ. ఎస్. అవస్థి ప్రశంసించారు. పరిశోధనలను పరిశ్రమతో కలిసి సంయుక్తంగా నిర్వహించాలని, తద్వారా రెండు సంస్థల్లోని ప్రతిభావంతుల సహకారంతో ప్రయోగశాలల మధ్య టెక్నాలజీ మరింతగా విస్తృతి చెందగలదని ఆయన తెలిపారు. టెక్నాలజీని సమర్ధమంతంగా ఉపయోగించడం ద్వరా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా రైతులకు సేవ చేయడమే ఈ ఒప్పంద అంతిమ లక్ష్యమని చెప్పారు. నేలలో పోషకాల సమతౌల్యాన్ని, తద్వారా మట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీసే రసాయనాలు మట్టి నుంచి పూర్తిగా తొలగించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రయత్నాలకు ICAR తన వంతు మద్దతు & ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఎంవోయూ సహాయపడగలదని ఆయన వివరించారు.

ADG (Extension) Dr. రణ్‌ధీర్ సింగ్ ముగింపు ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపారు.

న్యూఢిల్లీలోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ (IFFCO) పబ్లిసిటీ మరియు PR విభాగంచే ప్రచురితం.