
పట్టణాల్లో తోటలు పెంచాలనుకుంటున్న ఔత్సాహికుల అవసరాలను తీర్చుతాం
న్యూ ఢిల్లీ, జూన్ 2020: ఇఫ్కో – ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ లిమిటెడ్ ప్రపంచంలోనే అతి పెద్ద సహకార సంస్ధ. దీనికి అనుబంధంగా పనిచేసే ఆక్వా జీటీ పట్టణ తోటల పెంపకంలో ఓ అడగు ముందుకేసింది. పట్టణల్లో తోటలు పెంచాలనుకునే ఔత్సాహికులకు సహాయపడేందుకు ప్రత్యేకమైన ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ఉత్పత్తులు చాలా ఉపయోగకరం, చాలా బాగా పనిచేస్తాయి, వీటిని ఉపయోగించడం సులభం. ఇఫ్కో అర్బన్ గార్డెన్స్ పేరుతో వీటిని విడుదల చేశారు.
ఆక్వాగ్రి ప్రోసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఉత్పత్తుల మీద పరిశోధనలు చేసి అభివృద్ధి పరిచింది. తమిళనాడులోని మనమదురైలోని అధునిక ఆర్ అండ్ డి సెంటర్ లో ఈ ప్రక్రయి కొనసాగింది. ఆక్వాగ్రి ప్రోసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇఫ్కోకి అనుబంధ సంస్ధ. ఈ సంస్థ డిఎస్ఐఆర్ గుర్తింపు పొందింది. ఇది ఇండియన్ సైన్స్ సిస్టమ్ కి తగినట్టుగా పనిచేస్తుంది. ఈ ఉత్పత్తుల తయారీ, మార్కెంటిగ్ వ్యవహారాలను సహాయక సంస్ధ ఆక్వాగ్రీ గ్రిన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహిస్తారు.
పట్టణాల్లో తోటలు పెంచుతూ తమ మొక్కలని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకునేవాళ్లకు ఈ ఉత్పత్తుల ద్వారా సులభమైన పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ప్రాధమికంగా పర్యావరణ సహితమైన ఏడు రకాల ఉత్పత్తులను అందుబాటలోకి తెచ్చారు. మరిన్ని ఉత్పత్తులను తొందరలోనే వీటికి జత చేయనున్నారు. ఈ ఉత్పత్తులకు సంబంధించి మరిన్ని వివరాల కోసం www.aquagt.in వైబ్ సైట్ ను చూడండి. ఆ ఉత్పతులు ఏమిటంటే, న్యూట్రి రిచ్ – సముద్రపు నాచుతో బలవర్దకంగా తయారు చేసిన వర్మికంపోస్టు, ప్రొటక్ట్ + - వేప, జీవ రసాయనాలతో కూడిన పురుగుమందులతో మొక్కల రక్షణ, మ్యాజిక్ సోయిల్ – అన్ని రకాల కుండీ మొక్కలకు పనికొచ్చే మట్టి, సీ సీక్రెట్- ఎదుగుదల, మొక్క ఒత్తిడిని తట్టకునే సామర్ధ్యం అందించడం, గ్రీన్ డైట్ – మొక్కలకు వేగంగా శక్తినిచ్చే ఆహారం. లైఫ్ ప్రో- కత్తిరించిన పువ్వులు ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుంది, బొకాషి – వంటగదిలోవచ్చే వ్యర్ధాలను డీకంపోజ్ చేస్తుంది.
దీనికి సంబంధంచి ఇఫ్కో ఎండీ, డాక్టర్ అవస్థి ఏం చెప్పారంటే, ‘’52 ఏళ్లుగా భారతీయ రైతుల అవసరాలు తీరుస్తున్నాం. ఇప్పుడు మా అనుబంధ సంస్థ ఆక్వా జీటీ, పట్టణ వినియోగదారులతో ఒక బంధాన్ని ఏర్పర్చుకుంది, తోటల పెంపకానికి సంబంధించి వారి అవసరాలు తీరుస్తోంది.’’ ఇఫ్కో గో గ్రీన్ డ్రైవ్ ను ఇది పట్టణప్రాంతాల్లో బలోపేతం చేస్తుంది. పట్టణ ప్రాంత తోటల కోసం కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం తమకు సంతోషంగా ఉందన్నారు. ‘‘ పట్టణ ప్రజల్లో తోటల పెంపకం మీద ఆసక్తి పెరుగుతోంది, నమ్మకమైన, స్థిరమైన ఉత్పత్తుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఉదాహరణకు, తమ తోటలోని నేల సామర్ధ్యాన్ని అప్పటికప్పుడు పెంచే ఎరువులు లాంటి వాటి కోసం.’’
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, తోటల పెంపకానికి సంబంధించిన ఉత్పత్తుల మార్కెట్ విలువ 10,000 కోట్ల రూపాయలని అంచనా వేశారు. అందులో 50 శాతం వాట మొక్కలదే. మొక్కల సంరక్షణ ఉత్పత్తుల వాటా మొత్తం మార్కెట్ లో దాదాపు 15 శాతం ఉండొచ్చు. ఇక మిగిలిన దాంట్లో, కుండీలు, పరికరాలు, తోట అలంకరణకు సంబంధించినవి ఉంటాయి.
అక్వా అగ్రీ ఎండి ఇబ్రహీం సేత్ ఏం చెప్పారంటే, ‘‘ఇఫ్కో కొత్తగా ప్రారంభించి ఈ కామర్స్ సైట్ www.iffcobazar.in లోఈ కొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఎన్సీఆర్ ప్రాంతంలో ఎంపిక చేసిన నర్సరీల్లో దొరుకుతాయి. దేశమంతటా ఈ ఉత్పత్తులు వివిధ మార్గాల్లో అందుబాటులోకి తేవడానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం. సాంకేతికం, పంపిణీ వ్యవహారాలకు సంబంధించి భాగస్వామ్యానికి కంపెనీ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రత్యేమైన ఉత్పత్తులను అభివృద్ధి చేసి మార్కెట్ లో ప్రవేశపెడతాం. వినియోగదారుల నిరిష్టమైన అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను గ్రేడింగ్ చేస్తాం.’’
సాంకేతికపరమైన వివరాల కోసం
Cసంప్రదించండి: +91-96678-98069,
ఈమెయిల్ : info@aquagt.in
జారీ చేసినవారు:
Mమార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్,
ఆక్వా జీటీ