
-
ప్రధాన కార్యాచరణ
సముద్రనాచు సంబంధిత ఉత్పత్తులు
-
కార్పొరేట్ కార్యాలయం
తమిళనాడు
-
IFFCO's వాటా
50%
వ్యవసాయరంగం కోసం సముద్రపునాచు
ఆక్వాగ్రీ ప్రోసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆక్వాగ్రీ), సముద్రపునాచు నుంచి సేంద్రియ ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటిని వ్యవసాయం, పశుపోషణ, ఆహారపదార్ధాల తయారీ రంగాల్లో ఉపయోగిస్తారు. ఇఫ్కో పూర్తిగా తనదైన అనుబంధ సంస్ధ ఇఫ్కో ఈబజార్ లిమిటెడ్ ద్వారా అక్వాగ్రీ ప్రోసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో 50 శాతం వాటాను 2017లో దక్కించుకుంది.
ఆక్వాగ్రీ ప్రోసెసింగ్ యూనిట్ తమిళనాడులోని మనమదురై లో ఉంది. స్థానిక స్వయం సహాయ గ్రూపులతో సముద్రపు నాచు పండింపజేస్తోంది. సముద్రపునాచు ఉత్తత్తి కి సంబంధించిన టెక్నాలజీ కోసం సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ (సీఎస్ఎంఆర్సీ) నుంచి లైసెన్సు తీసుకోవాలి. ఇది భారత ప్రభుత్వానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఏర్పాటు చేసిన లేబొరేటరీ.
పంటల కోసం ఎటువంటి రసాయనిక ఉత్పత్తులు లేని జీవ సంబంధ ఎరువులు, సంరక్షణ మందులను మార్కెట్ లోకి తీసుకురావాలన్న ప్రణాళికలతో సిద్ధంగా ఉంది ఇఫ్కో.