


బోరాన్ 20%
పంట పుష్పించాలన్నా, కాయలు కాయాలన్నా కీలకమైన సూక్ష్మపోషకం బొరాన్. ఇఫ్కో వారి బోరాన్ (డై సోడియం టెట్రా బొరాన్ పెంటా హైడ్రేట్) (బి 20%) కీలకమైన సూక్ష్మ పోషకాలను సంవృద్ధిగా అందజేస్తుంది. మొక్కలు కాల్షియం లాంటి సూక్ష్మపోషకాలను గ్రహించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్య ప్రయోజనాలు
పుష్పించడాని, కాయలు కాయడానికి ఇది చాలా ముఖ్యం
పంట దిగుబడి పెంచడంలో కీలకం
కాల్షియం గ్రహించడానికి సహాయడుతుంది
పండ్ల నాణ్యత, సైజు పెంచుతుంది

బోరాన్ 20% ఎలా ఉపయోగించాలి
ఎరువులు వేసేటప్పుడు ఎంతెంత దూరంలో వేయాలి, ఏ నిష్పత్తిలో వేయాలి, పంట ఏ దశలో ఉన్నప్పుడు వేయాలన్న అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి.
బోరాన్ ను విత్తనాలు నాటేటప్పడు, లేదా పంట ఎదిగిన తర్వాత నేరుగా నేల మీద వేసేయవచ్చు. ఉప్పు నేలల్లో మాత్రం అలా చేయకూడడు. అక్కడ స్ప్రే తో పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉండే బురద నేలల్లో అయితే ఎకరానికి 10 నుంచి 14 కిలోలు చొప్పున, తేలికపాటి నేలలు అయితే 7 నుంచి 10 కేజీలు చొప్పున చల్లుకోవాలి.