
<ఈ రోజు జరిగిన ఎన్నికలో బోర్డు, సింఘాని ను ఇఫ్కో 17వ చైర్మన్ గా ఎన్నుకుంది
న్యూఢిల్లీ, జనవరి 19, 2022: ప్రపపంచంలోనే మొదట్టమొదటి, అతిపెద్ద కోపరేటవ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ (ఇఫ్కో) ఎన్నికలు ఈరోజు జరిగాయి. 17వ చైర్మన్ గా శ్రీ దిలిప్ సింఘాని ఎన్నికయ్యారు. ఇంతకు ముందు చైర్మన్ గా పనిచేసి శ్రీ బల్విందర్ సింగ్ నాకై 11 అక్టోబర్ 2021న మరణించడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఇఫ్కో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు శ్రీ దిలిప్ సింఘానిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఇంతకు ముందు ఇఫ్కో వైస్ చైర్మెన్ గా పనిచేశారు.
చైర్మెన్ గా ఎన్నికైన తర్వత సింఘాని మాట్లాడుతూ, రైతులు, సహకార సంఘాల కోసం ఇఫ్కో నిబద్దతో పనిచేస్తుందన్నారు. ప్రధానమంత్రి విజన్ ‘‘సహకార్ ఈ సంవృద్ధి’’ కి కట్టుబడి రైతుల కోసం పనిచేస్తామని ప్రకటించారు.
ఇఫ్కో ఎండి డాక్టర్ అవస్థి మాట్లాడుతూ, ప్రధానమంత్రి విజన్ అయిన ఆత్మనిర్బర్ కృషి, అత్మర్భర్ భారత్ కి కట్టుబడి, రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి చేస్తున్న కృషిని కొనసాగిస్తామన్నారు.
శ్రీ దిలిప్ భాయ్ సింఘాని గుజరాత్ కి చెందిన సీనియర్ కో ఆపరేటర్, గుజరాత్ స్టేట్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జియుజెసిఒఎంఎఎస్ఒఎల్) కి కూడా ఆయన చైర్మన్. ఆయన 2017 నుంచి ఆ పదవిలోకొనసాగుతున్నారు. గతంలో ఆయన గుజరాత్ ప్రభుత్వ క్యాబినెట్ లో వ్యవసాయ, పశుసంవర్దక, మత్య్సశాఖ, ఎక్సైజ్ శాఖ, చట్ట సభల వ్యవహారల మంత్రిగా పనిచేశారు. 2019లో ఇఫ్కో వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. శ్రీ దిలిప్ సింఘాని 2021లో ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ కోపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ సి యుఐ) గా ఎన్నికై ఒక చారిత్రాత్మ రికార్డు నమోదు చేశారు. భారతదేశంలోని సహకార సంస్థలు అన్నింటికీ ఇదే అత్యున్నతమైన వ్యవస్థ.
ఇఫ్కో ఏర్పాటైనప్పటి నుంచి కూడా భారతీయ రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. 70ల నాటి హరిత విప్లవం కాలం నుంచి దశాబ్దాల పాటు అందించిన సేవలతో ఏర్పర్చుకున్న నమ్మకంతోనే ఇఫ్కో ఈ స్థాయికి చేరుకుంది. 2000 సంవత్సరంలో మొదలైన గ్రామీణ మొబైల్ టెలిఫోనీతో సమకాలీన టెక్నాలజీ, సేవలు అన్నీ కూడా డిజిటల్ చొరవతో రైతుల అరచేతిలోకి వచ్చేశాయి. ప్రపంచంలోనే మొట్టమొదటగా నానో టెక్నాలజీ ఆధారిత ఎరువు ఇఫ్కో నానో యూరియా లిక్విడ్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఇఫ్కో దే. మార్గదర్శంగా నిలిచిపోయే అడుగులకు , చర్యలకు ఇఫ్కో నాయకత్వం మద్దతునివ్వడం వినూత్న ఆవిష్కరణలకు కీలకమైంది.