
రైతాంగ
అభివృద్ధి
కార్యక్రమాలు
రైతు ఎక్స్‌టెన్షన్ కార్యకలాపాలు
ప్రధానంగా నేల పరిస్థితిని మెరుగుపర్చడం, N:P:K వినియోగ నిష్పత్తిని మెరుగుపర్చేలా ఎరువులను సమతుల్యంగా మరియు సమీకృతంగా వాడటాన్ని ప్రోత్సహించడం, సెకండరీ మరియు సూక్ష్మ పోషకాలు అలాగే లేటెస్ట్ ఆగ్రో టెక్నాలజీ ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచేందుకు వివిధ రకాల ప్రమోషనల్ మరియు ఎక్స్‌టెన్షన్ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. దిగుబడిని పెంచేందుకు ఎరువులను సమర్ధంగా వినియోగించుకోవడం, నీటిని సంరక్షించుకోవడం తద్వారా సుస్థిరమైన విధానాల్లో వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించడానికి ఇవి దోహదపడ్డాయి.
2017-18 ఆర్థిక సంవత్సరంలో సీవోఆర్‌డీఈటీ 306 పైచిలుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు సహా 17,891 మంది పైచిలుకు రైతులు వీటితో లబ్ధి పొందారు. 2017-18 సంవత్సరంలో ఫూల్‌పూర్ మరియు కలోల్‌లోని సాయిల్ టెస్టింగ్ ల్యాబరేటరీల ద్వారా రైతులకు ఉచితంగా నేల పరీక్షల సదుపాయాలను అందించడంతో పాటు 95,104 సాయిల్ శాంపిల్స్ కూడా పరీక్షించింది. వీటితో పాటు అదనంగా ఆరు సూక్ష్మ పోషకాల కోసం 21,000 పైగా సాయిల్ శాంపిల్స్‌ను కూడా విశ్లేషించింది.
నేలలో సూక్ష్మక్రిముల కార్యకలాపాలను పెంచేందుకు సీవోఆర్‌డీఈటీ తమ కలోల్ యూనిట్‌లో ద్రవ రూప జీవ-ఎరువుల ఉత్పత్తి వార్షిక సామర్థ్యాన్ని 1.5L లీటర్ల నుండి 4.75L లీటర్లకు పెంచుకుంది. 2017-18లో మొత్తం 8.6L లీటర్ల జీవ ఎరువుల ఉత్పత్తి చేసింది.
దేశవాళీ జాతి ఆవుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఫూల్‌పూర్లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో 66,422 లీటర్ల ఆవు పాలు ఉత్పత్తి చేయబడ్డాయి.
ఏటా 150 MT సామర్థ్యంతో సీవోఆర్‌డీఈటీ పూల్‌పూర్‌లో వేప నూనె ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్ ఏర్పాటు చేయబడింది.
సీవోఆర్‌డీఈటీ 14 గ్రామాల్లో సమీకృత గ్రామీణ అభివృద్ధి ప్రోగ్రాం (ఐఆర్‌డీపీ)ని చేపట్టింది. కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణం, తాగు నీటి సదుపాయాల ఏర్పాటు, మొక్కలు నాటడం, నేల పరీక్షల ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, పశువుల దాణా సరఫరా, వర్మికంపోస్ట్ వినియోగాన్ని ప్రోత్సహించడం, మినీ-కిట్ పంపిణీ (సీఐపీ) మొదలైన కార్యక్రమాలను ఈ గ్రామాల్లో చేపట్టింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వివిధ అంశాల్లో 175 పైచిలుకు కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వీటితో 15,272 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది.