Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...

విద్యా సంబంధ
కార్యక్రమాలు

వ్యవసాయ విశ్వవిద్యాలయాలు & సహకార సంస్థల్లో ప్రొఫెసర్స్’ చెయిర్

తర్వాత తరానికి విజ్ఞానం మరియు అనుభవాన్ని అందించే లక్ష్యంతో పేరొందిన పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు సహకార సంస్థల్లో ఇఫ్కో ప్రత్యేకంగా ‘ప్రొఫెసర్స్ చెయిర్స్‌’ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 18 చెయిర్స్‌ ఉన్నాయి. కార్యాచరణ ప్రణాళికలను చర్చించే సదస్సుల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పొషిస్తున్నాయి.

ప్రస్తుత ఆగ్రానమీ, సాయిల్ సైన్స్, ఆగ్రో ఎకనమిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, కోఆపరేషన్ మరియు ఫెర్టిలైజర్ టెక్నాలజీ విభాగాల్లో ఇఫ్కో 18 సంస్థల్లో చెయిర్స్ నెలకొల్పింది. పరిశోధన, విద్య, మరియు ఎక్స్‌టెన్షన్ అంశాలను అనుసంధానం చేసేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ఈ చెయిర్స్ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

,
అంశం / సంస్థ స్థానం లో సెటప్ చేయండి
I. ఆగ్రానమీ
పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లూధియానా ఆగస్టు, 1980
జవహర్‌లాల్ నెహ్రూ కృషి విశ్వ విద్యాలయ జబల్పూర్ (ఇండోర్ క్యాంపస్) జనవరి, 1982
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ మే, 1982
చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ కాన్పూర్ డిసెంబర్, 1985
తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం కోయంబత్తూరు డిసెంబర్, 1985
బిధాన్ చంద్ర కృషి విశ్వ విద్యాలయ నదియా, పశ్చిమ బెంగాల్ ఏప్రిల్, 1986
సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ మీరట్, ఉత్తరప్రదేశ్ సెప్టెంబర్ 2005
II. సాయిల్ సైన్స్
గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జునాగర్ జూన్, 1980
గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ పంత్‌నగర్ అక్టోబర్, 1980
సీసీఎస్ హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం హిసార్ మార్చి,1982
ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ భువనేశ్వర్ ఫిబ్రవరి, 1985
రాజస్థాన్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బికనీర్, (ఉదయ్‌పూర్ క్యాంపస్) ఏప్రిల్, 1981
సీఎస్‌కే హిమాచల్ ప్రదేశ్ కృషి విశ్వవిద్యాలయ పాలంపూర్ 2005
III. ఎక్స్‌టెన్షన్ అండ్ కోఆపరేషన్
యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ బెంగళూరు ఆగస్టు, 1980
వైకుంఠ్ మెహతా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ పూణే డిసెంబర్,1981
IV. ఆగ్రో ఎకనామిక్స్
కేరళ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెల్లనిక్కర మే, 1995
V. ఫెర్టిలైజర్ టెక్నాలజీ
బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి మే, 1998

రైతు సంబంధ కార్యక్రమాలు

సోషల్ మీడియాలో కమ్యూనిటీ అప్‌డేట్‌లు