,
Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
ఎం.కె.పి (0:52:34)
ఎం.కె.పి (0:52:34)

ఎం.కె.పి (0:52:34)

ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో అధిక మొత్తంలో ఫాస్ఫేట్, తగు మోతాదులో పొటాష్, సోడియం ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా పనిచేస్తుంది. నీటిలో కరిగే ఎరువుల(డబ్ల్యూఎస్ఎఫ్) ను ఫలదీకరణం* లో సహాయం చేయడానికి అభివృద్ది పరిచారు. ఈ పద్ధతిలో ఎరువులను, డ్రిప్ సిస్టమ్ ద్వారా అందించే నీళ్లలో కలిపేస్తారు.

ఉత్పత్తిలో పోషకాలు

లాభాలు

  • key-benifit-icon1వేర్లు, గింజలు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాపడుతుంది
  • key-benifit-icon2మొక్కల్లో నిరోధక సామర్ధ్యాన్ని పెంచుతుంది
  • key-benifit-icon3అధిక ధిగుబడిని ఇస్తుంది.
  • icon4అంకురోత్పత్తి రేటు అధికంగా ఉండేలా చేస్తుంది
  • icon5పంట సరైన సమయంలో పండేలా చేస్తుంది
plant

ఎం.కె.పి. ఉపయోగించడం ఎలా

ఈ ఎరువుల్ని ఉపయోగించేటప్పుడు పంట విస్తీర్ణం, పంట దశ ను పరిగణలోకి తీసుకోవాలి. పంట తొలి దశ నుంచి పుష్పించడానికి ముందు దశ వరకు ఉపయోగించాలి. దీనిని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో లేదా ఆకుల మీద పిచికారీ చేసే పద్ధతిలో పంటకు అందించవచ్చు.

డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో అయితే సూచించిన మోతాదులో ఎరువును వాడుకోవాలి. లీటర్ నీటికి 1.5 నుంచి 2 గ్రాముల ఎన్ పికె చొప్పున కలుపుకోవాలి, నేల స్వభావం, పంట రకాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

ఆకులు మీద స్ప్రేతో పిచికారీ చేసే పద్ధతి అయితే, విత్తిన 30, 40 రోజల తర్వాత నుంచి పూత వచ్చే వరకు మోనో అమ్మోనియం పాస్పెట్ (0-52-34) ను 0.5 – 1.0% నిష్పత్తిలో 10, 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.

కాల్షియం నైట్రేట్
కాల్షియం నైట్రేట్

ఇది కాల్షియం, నైట్రోజన్ లను కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. నీటిలో కరిగే కాల్షియంకు ఇదొక్కటే మూలం. కీలకమైన పోషకం అన్న సంగతి పక్కన పెడితే, ఇది మొక్కల్లో కొన్ని రకాల తెగుళ్లను కూడా నియంత్రిస్తుంది.

మరింత తెలుసుకోండి ఆన్ లైన్ లో కొనండి
ఎం.ఎ.పి. (12:61:0)
ఎం.ఎ.పి. (12:61:0)

ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో అధిక మొత్తంలో ఫాస్ఫేట్, తగు మోతాదులో నత్రజని ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా పనిచేస్తుంది. నీటిలో కరిగే ఎరువుల(డబ్ల్యూఎస్ఎఫ్) ను ఫలదీకరణం* లో సహాయం చేయడానికి అభివృద్ది పరిచారు. ఈ పద్ధతిలో ఎరువులను, డ్రిప్ సిస్టమ్ ద్వారా అందించే నీళ్లలో కలిపేస్తారు.

మరింత తెలుసుకోండి ఆన్ లైన్ లో కొనండి
యూరియా ఫాస్ఫేట్ (17:44:0)
యూరియా ఫాస్ఫేట్ (17:44:0)

ఫాస్ఫరస్ మరియు నత్రజని అధిక మోతాదులో ఉండి మొక్కల ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు డ్రిప్ పైప్‌లను కూడా శుభ్రపర్చగలిగి, నీటిలో కరిగిపోయే ఎరువు ఇది. ఇది తక్షణం నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యం ద్వారా మరియు ఆకులపై పిచికారీ చేసేందుకు అనువైన ఎరువు.

మరింత తెలుసుకోండి ఆన్ లైన్ లో కొనండి
ఎస్.ఓ.పి. (0:0:50)
ఎస్.ఓ.పి. (0:0:50)

ఇది అధిక స్థాయిలో పొటాషియం, సల్ఫేట్ సల్ఫర్ మరియు తగిన మోతాదులో సోడియం కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. ఇది తక్షణమే నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యానికి, ఆకులపై వేసేందుకు అనువైన ఎరువు.

మరింత తెలుసుకోండి ఆన్ లైన్ లో కొనండి
ఎన్.పి.కె. 19:19:19
ఎన్.పి.కె. 19:19:19

ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో కావల్సింత మొత్తంలో నత్రజని, భాస్వరం, పొటాషియం, సోడియం ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా అనుకూలం.

మరింత తెలుసుకోండి ఆన్ లైన్ లో కొనండి
ఎస్.ఒ.పి. (18:18:18 మరియు 6.1% S)తో యూరియా ఫాస్ఫేట్
ఎస్.ఒ.పి. (18:18:18 మరియు 6.1% S)తో యూరియా ఫాస్ఫేట్

ఇది 6% సల్ఫర్‌ కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే NPK ఎరువు. ఇది నీటిలో తక్షణమే కరిగిపోతుంది. వేర్లు దీన్ని సులభంగా గ్రహించుకుని, మొక్కలకు అవసరమైన పోషకాలను అందించగలవు. ఫెర్టిగేషన్* విధానానికి తోడ్పాటు అందించేందుకు నీటిలో కరిగిపోయే ఎరువులు (WSF) అభివృద్ధి చేయబడ్డాయి. ఈ విధానంలో తుంపర వ్యవస్థ ద్వారా సాగు నీటి ద్వారా ఎరువును అందిస్తారు.

మరింత తెలుసుకోండి ఆన్ లైన్ లో కొనండి
పొటాషియం నైట్రేట్ (13:0:45)
పొటాషియం నైట్రేట్ (13:0:45)

ఇది అధిక స్థాయిలో పొటాషియం, నత్రజని మరియు తగిన మోతాదులో సోడియం కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. ఇది తక్షణమే నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యానికి, ఆకులపై వేసేందుకు అనువైన ఎరువు.

మరింత తెలుసుకోండి ఆన్ లైన్ లో కొనండి