


మెగ్నిషియం సల్ఫేట్
మెగ్నిషియం సల్ఫేట్ ద్వితీయశ్రేణి పోషకం. నేలలో మెగ్నిషియం తక్కువగా ఉంటే దీనిని ఉపయోగించాలి. పంట నత్రజని, భాస్వరం గ్రహించడంలో ఇది సహాయపడుతుంది. మెగ్నిషియం ఎక్కువగా ఉండే నేలలు కావాల్సిన పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కుండీల్లో పెంచే మొక్కల ఎరువుల మిశ్రమంలో కూడా దీనిని వాడతారు.
లాభాలు
పత్రహరితం మోతాదును పెంచి పంట పచ్చగా ఉండేలా చూస్తుంది
ఎంజైములు ఏర్పడటంలో కీలకం
మొక్కలు కార్బోహైడ్రేట్ ను ఉపయోగించుకునే స్థాయిని పెంచుతుంది
చెరకులో ఎంజైముల ఉత్పత్తిని పెంచుతుంది
కొత్త కొమ్మలు, మొలకలు వచ్చేందుకు సహాయడుతుంది
మొక్కలు నత్రజని, భాస్వరాన్ని స్వీకరించే శక్తిని పెంచుతుంది

మెగ్నిషియం సల్ఫేట్ ఉపయోగించడం ఎలా
ఈ ఎరువుల్ని ఉపయోగించేటప్పుడు పంట విస్తీర్ణం, పంట దశ ను పరిగణలోకి తీసుకోవాలి. మెగ్నిషం సల్ఫేట్ ను విత్తుకునేటప్పుడు లేదా పంట ఎదిగిన తర్వాత నేల మీద నేరుగా చల్లుకోవచ్చు.
తేమ, బురద ఎక్కువగా ఉండే నేలల్లో పండించే పంటలకు ఎకరాకు 50 నుంచి 60 కిలోల వరకు వేసుకోవాలి. తేలికపాటి నేలలు అయితే 40 నుంచి 50 కిలోలు సరిపోతుంది.
ఈ ఎరువును ఆకుల మీద పిచికారీ చేసుకునే పద్ధతిలో కూడా వాడుకోవచ్చు. ఈ పద్ధతిలో 5 గ్రాముల ఇఫ్కో మెగ్నిషియం సల్ఫేట్ ను 1 లీటర్ నీటిలో కలుపుకోవాలి. నీళ్లతో పాటుగా మొక్క ఈ పోషకాలను బాగా ఎక్కవగా గ్రహిస్తుంది. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో దీనిని 2, 3 సార్లు పిచికారీ చేయాలి. సరైన నాజిల్ ఉపయోగించి ఉదయం లేదా సాయంత్రం పూట పిచికారీ చేయాలి. పంట, నేలను బట్టి తగిన స్ప్రే ఉపయోగించాలి. ఆకు మొత్తం ఎరువుతో తడిచేలా చూసుకోవాలి.