


ఎన్.పి.కె. 19:19:19
ఇది నీటిలో కరిగిపోయే ఎరువు. ఇందులో కావల్సింత మొత్తంలో నత్రజని, భాస్వరం, పొటాషియం, సోడియం ఉంటాయి. ఇది వెంటనే నీటిలో కరిగిపోతుంది, బిందు సేద్యానికి ,ఆకుల మీద పిచికారీ చేసే విధానానికి బాగా అనుకూలం. ఈ కాంబినేషన్ అన్ని పంటలకు ఇది పనిచేస్తుంది. దీనిని పురుగులమందులు, కీటకనాశులతో పాటుగా వాడుకోవచ్చు. నీటిలో కరిగే ఎరువుల(డబ్ల్యూఎస్ఎఫ్) ను ఫలదీకరణం* లో సహాయం చేయడానికి అభివృద్ది పరిచారు. ఈ పద్ధతిలో ఎరువులను, డ్రిప్ సిస్టమ్ ద్వారా అందించే నీళ్లలో కలిపేస్తారు.
కీలక ప్రయోజనాలు
వేర్లు , గింజలు వేగంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది
మొక్క వ్యాధి నిరోధక సామర్ధ్యాన్నిపెంచుతుం
ఉత్పత్తి నాణ్యత పెంచుతుంది
అంకురోత్పతి రేటు అధికంగా ఉండేలా చూస్తుంది
పంట సరైన సమయానికి పక్వానికి వచ్చేలాచూస్తుంది
పంటకు కొత్త శక్తిని ఇస్తుంది

ఎన్.పి.కె. 19:19:19 ఎలా ఉపయోగించాలి
ఈ ఎరువుల్ని ఉపయోగించేటప్పుడు పంట విస్తీర్ణం, పంట దశ ను పరిగణలోకి తీసుకోవాలి. పంట అన్ని దశల్లోనూ ఈ ఎరువు ఉపయోగకరం. మొక్క ఏపుగా ఎదిగేందుకు అవసరమైన శక్తిని ఇస్తుంది. దీనిని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో లేదా ఆకుల మీద పిచికారీ చేసే పద్ధతిలో పంటకు అందించవచ్చు.
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో అయితే సూచించిన మోతాదులో ఎరువును వాడుకోవాలి. లీటర్ నీటికి 1.5 నుంచి 2 గ్రాముల ఎన్ పికె చొప్పున కలుపుకోవాలి, నేల స్వభావం, పంట రకాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
ఆకులు మీద స్ప్రేతో పిచికారీ చేసే పద్ధతి అయితే, విత్తిన 30, 40 రోజల తర్వాత నుంచి పూత వచ్చే వరకు ఎన్.పి.కె 19:19:19 ని 0.5 – 1.0% నిష్పత్తిలో 10, 15 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి.