


మొక్కల ఎదుగుదలకు దోహదకారి – సాగరిక లిక్విడ్
సాగరిక – సీవీడ్ ఎక్స్‌ట్రాక్ట్ కాన్సెంట్రేట్ (28% w/w) అనేది ఒక సేంద్రియ బయో-స్టిమ్యులెంట్. అంతర్జాతీయంగా పేటెంటు పొందిన టెక్నాలజీతో ఇది ఎరుపు మరియు గోధుమ రంగులోని సముద్రపు నాచు నుండి తయారుచేయబడుతుంది. మొక్క ఎదుగుదలకు దోహదపడే సహజసిద్ధమైన ఆక్సిన్లు, సైటోకినిన్లు ఇంకా గిబ్బరెలిన్లు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, స్థూల & సూక్ష్మ పోషకాలు మొదలైనవి ఈ ఉత్పత్తిలో ఉంటాయి. అలాగే, గ్లైసీన్, బెటెయిన్, కోలీన్ వంటి క్వాటర్నరీ అమోనియం సమ్మేళనాలతో (QAC) పాటు బయో-పొటాష్ (8-10%) కూడా ఉంటుంది.
ఆకులపై లేదా మొక్కల వేర్ల వద్ద ఉన్న నేలపై స్ప్రే చేసినప్పుడు, పోషకాలను గ్రహించుకునేలా, సమర్ధమంతంగా ఉపయోగించుకునేలా మొక్కల్లో జీవక్రియను సాగరిక ఉత్తేజపరుస్తుంది. ఇది పంట దిగుబడి మరియు నాణ్యత పెరగడానికి దోహదపడుతుంది.
భారత ప్రభుత్వ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఏర్పాటు చేసిన ప్రయోగశాల సెంట్రల్ సాల్ట్ అండ్ మెరీన్ కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSMCRI) నుంచి తీసుకున్న టెక్నాలజీతో సాగరికను తయారు చేశాము. అంతర్జాతీయంగా పేటెంట్ ఉన్న ఈ టెక్నాలజీకి మేము లైసెన్సు తీసుకున్నాము.
IFFCO సాగరిక లిక్విడ్ గురించి మరింత తెలుసుకునేందుకు దయచేసి ఉత్పత్తి వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Technical Specifications
Specification of IFFCO Sagarika Granulated (Liquid Seaweed Extract).
- | Concentrated Liquid Seaweed Extract (28% w/w) |
Salient Features
- Concentrated seaweed liquid extract
- Eco-friendly
- Contains Protein, Carbohydrate along with other micronutrients
- Useful for all crops and all soils
- Contains Auxin, Cytokinins, and Gibberellin, Betaines, Mannitol, etc.