


పొటాషియం నైట్రేట్ (13:0:45)
ఇది అధిక స్థాయిలో పొటాషియం, నత్రజని మరియు తగిన మోతాదులో సోడియం కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. ఇది తక్షణమే నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యానికి, ఆకులపై వేసేందుకు అనువైన ఎరువు. పూతకి వచ్చిన తర్వాత, అలాగే పంట ఎదుగుదలకు ఈ మేళవింపు ఎంతో అనువైనది. ఫెర్టిగేషన్* విధానానికి తోడ్పాటు అందించేందుకు నీటిలో కరిగిపోయే ఎరువులు (WSF) అభివృద్ధి చేయబడ్డాయి. ఈ విధానంలో తుంపర వ్యవస్థ ద్వారా సాగు నీటి ద్వారా ఎరువును అందిస్తారు.
ప్రయోజనాలు
వేర్లు, విత్తనాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు సహాయపడుతుంది
మొక్కల్లో వ్యాధినిరోధక సామర్థ్యాలను పెంచుతుంది
అధిక స్థాయిలో మొలకలు రావడానికి సహాయపడుతుంది
పంటలు సకాలంలో కోతకొచ్చేలా తోడ్పడుతుంది
నిర్జీవంగా చేసే మంచు, వర్షాభావం వంటి ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు మొక్కల్లో నిరోధక శక్తి పెరుగుతుంది
తెగుళ్లు మరియు అంటువ్యాధులను ఎదుర్కొనే నిరోధక శక్తిని పెంచుతుంది

పొటాషియం నైట్రేట్‌ను (13:0:45) ఎలా ఉపయోగించాలి
పంట దశ, పరిమాణాన్ని బట్టి ఎరువును ఉపయోగించాలి. మధ్య దశ నుంచి మెచ్యూరిటీ దశకు వచ్చే వరకూ ఈ ఎరువు ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని ఇటు తుంపర సేద్యం, అటు ఆకులపై పిచికారీ చేసే విధానంలోనూ ఉపయోగించవచ్చు.
తుంపర సేద్యం విధానంలో, పంట మరియు నేల రకాన్ని బట్టి లీటరు నీటికి 1.5 నుంచి 2.5 గ్రాముల వరకు ఎరువును కలిపి ఉపయోగించవచ్చు.
ఆకులపై పిచికారీ చేసే విధానం విషయానికొస్తే లీటరు నీటిలో 1.0-1.5 గ్రాముల మేర నీటిలో కరిగిపోయే పొటాషియం నైట్రేట్ (13-0-45)ను కలపాలి. పంట వేసిన 60-70 రోజుల తర్వాత దీన్ని ఉపయోగించాలి.