


సీ సీక్రెట్ – 200 మి.లీ.
IFFCO అర్బన్ గార్డెన్స్ – సీ సీక్రెట్ 200 మి.లీ. – ద్రవ రూప సముద్రనాచు ఎక్స్‌ట్రాక్ట్ – సేంద్రియ జీవ-ఉత్ప్రేరకం
సీ సీక్రెట్ – మీ ఇంటి పంట కోసం సేంద్రియ సముద్రనాచు ఎక్స్‌ట్రాక్ట్ ఆధారిత జీవ ఉత్ప్రేరకం.
ఈ విశిష్టమైన జీవ ఫార్ములేషన్ వేస్తే మీ మొక్కలు “సంతోషకరమైన మొక్కలు”గా మారతాయి.
ఇది మొక్కలకు సహజసిద్ధంగా అవసరమైన పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు, అమైనో యాసిడ్‌లు, సేంద్రియ యాసిడ్‌లు, పాలీసాకరైడ్‌లు, మొక్కల సంబంధ హార్మోన్లు (ఆక్సిన్లు, సైటోకినిన్‌లు మరియు గిబరెలిన్లు); బెటెయిన్, మానిటోల్ మొదలైన వాటిని అందిస్తుంది. ‘సీ సీక్రెట్’ను వేసినప్పుడు ఇది మొక్క జీవక్రియను ఉద్దీపింపచేస్తుంది, వేర్లు – కాండం సామర్థ్యాలను పెంచుతుంది, ఆకులు పచ్చగా ఎదిగేలా చేస్తుంది. దీనితో పూత, పిందెలు కాయడం మరింతగా పెరుగుతుంది.
సమ్మేళనం:
కచ్చితమైన 28% w/ v గాఢతతో ఎరుపు & గోధుమ రంగు నాచు ఎక్స్‌ట్రాక్ట్, హ్యుమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్
ప్రయోజనాలు
- మెరుగ్గా వేర్లు, కాండం ఎదుగదల, పచ్చని ఆకులు, పూలు మరియు పళ్ల ఆరోగ్యకరమైన ఎదుగుదల, నాణ్యమైన పంట
- వేడి, చల్లని మరియు వర్షాభావ పరిస్థితుల వల్ల తలెత్తే ఒత్తిళ్లను మొక్కలు ఎదుర్కొనగలవు
- నేలకు సంబంధించిన వృక్షజాలం మరియు జంతుజాలం, సూక్ష్మక్రిములు, వానపాములు మొదలైన వాటికి అనువైన వాతావరణ కల్పిస్తుంది
- ఇన్‌డోర్/అవుట్‌డోర్ మొక్కలు, బెడ్, మరియు బాల్కనీల్లో పెంచుకునే మొక్కలు, చెట్లు, గార్డెన్ లాన్‌లు, టర్ఫ్‌లు మొదలైన వాటికి అనువైనది.

- 2.5 మి.లీ. ద్రావకం తీసుకుని 1 లీటరు నీటిలో కలపాలి. ఆకుల మీద పిచికారీ చేయడానికి ముందు లేదా నేరుగా ప్లాంట్ బెడ్ లేదా కుండీల్లోని మొక్కలపై వేసే ముందు బాగా కలియతిప్పాలి. కూరగాయలు / పూల మొక్కల మొలకలను నాటు వేసే ముందు ద్రావకంలో ముంచి తీయాలి.
- మెరుగైన ఫలితాల కోసం, ప్రతి 2-3 వారాలకోసారి పునరావృతం చేయాలి.”


- చల్లని మరియు పొడి ప్రదేశంలో భద్రపర్చాలి మరియు పిల్లల చేతికి అందకుండా దూరంగా ఉంచాలి.
