


ఎస్.ఓ.పి. (0:0:50)
ఇది అధిక స్థాయిలో పొటాషియం, సల్ఫేట్ సల్ఫర్ మరియు తగిన మోతాదులో సోడియం కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే ఎరువు. ఇది తక్షణమే నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యానికి, ఆకులపై వేసేందుకు అనువైన ఎరువు. పూత మరియు పిందెలు పటిష్టంగా ఎదిగేందుకు ఈ మేళవింపు తోడ్పడుతుంది. ఫెర్టిగేషన్* విధానానికి తోడ్పాటు అందించేందుకు నీటిలో కరిగిపోయే ఎరువులు (WSF) అభివృద్ధి చేయబడ్డాయి. ఈ విధానంలో తుంపర వ్యవస్థ ద్వారా సాగు నీటి ద్వారా ఎరువును అందిస్తారు.
కీలక ప్రయోజనాలు
మొక్క ఎదుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది
మొక్కల్లో వ్యాధి నిరోధక సామర్థ్యాలను పెంచుతుంది
అన్ని పంటలకు అనువైనది
పూత మరియు పిందె ఎదుగుదలను పెంచుతుంది
తెగుళ్లు మరియు అంటువ్యాధులను ఎదుర్కొనే నిరోధక శక్తిని పెంచుతుంది
నిర్జీవంగా మార్చేసే అధిక ఉష్ణోగ్రతలు, తేమ రాహిత్యం వంటి ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు మొక్కల్లో నిరోధక శక్తి పెరుగుతుంది
ఎస్.ఓ.పి. (0:0:50) ని ఎలా ఉపయోగించాలి
పంట చక్రం యొక్క నిష్పత్తి మరియు సమయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎరువులు వాడాలి. ఈ ఎరువును పంటలకు పుష్పించే ముందు మరియు తరువాత దశలలో వాడాలి. దీనిని డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో మరియు లీఫీ స్ప్రే పద్ధతిలో ఉపయోగించవచ్చు.
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా సిఫార్సు చేయబడిన ఎరువుల మోతాదులో పంట మరియు నేల రకాన్ని పరిగణనలోకి తీసుకొని లీటరు నీటికి 1.5 నుండి 2.5 గ్రాముల ఎరువులు కలపాలి.
లీఫీ స్ప్రే పద్ధతిలో ఎరువులు వేసేటప్పుడు 0.5 నుండి 1.0% నీటిలో కరిగే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ (00-00-50) లీటరు నీటికి కలిపి పూలు వచ్చిన తర్వాత వేయాలి.