


సల్ఫర్ బెంటోనైట్
సల్ఫర్ బెంటోనైట్ అనేది నిఖార్సయిన సల్ఫర్ మరియు బెంటోనైట్ బంకతో తయారైనది. దీన్ని ద్వితీయ పోషకంగా అలాగే క్షారస్వభావం గల నేలల్లో సమస్యలను సరిదిద్దడానికి కూడా ఉపయోగిస్తారు. మొక్కలకు అవసరమైన 17 కీలకమైన పోషకాల్లో సల్ఫర్ కూడా ఒకటి. ఇది ప్రధానమైన ఎంజైమ్‌లు మరియు ప్రొటీన్లు తయారయ్యేందుకు సహాయపడుతుంది.
ముఖ్యమైన ప్రయోజనాలు
పంటలను పచ్చగా ఉంచుతుంది
పంట దిగుబడిని, ముఖ్యంగా నూనెగింజల దిగుబడి పెంచుతుంది
ఎంజైమ్ మరియు మొక్కల ప్రోటీన్ ఏర్పడటానికి అవసరం

సల్ఫర్ బెంటోనైట్‌ను ఎలా ఉపయోగించాలి
పంట వేసిన ప్రదేశం, పరిమాణం, దశను బట్టి ఎరువులను ఉపయోగించాలి. పంట నాటే సమయంలో లేదా పంట నిలువుగా ఎదిగిన దశలో సల్ఫర్ బెంటోనైట్‌ను నేరుగా నేల మీద జల్లాలి. నూనెగింజలు మరియు పప్పుధాన్యాల పంటుల కోసం ఎకరాకు 12-15 కేజీల మోతాదులో వేయాలి. అలాగే తృణధాన్యాల విషయంలో ఎకరాకు 8-10 కేజీల మోతాదులో వాడాలి. ఇక పండ్లు మరియు కూరగాయల పంటల కోసం ఎకరాకు 10-12 కేజీల డోసేజీ సిఫార్సు చేయబడింది.