


యూరియా ఫాస్ఫేట్ (17:44:0)
ఫాస్ఫరస్ మరియు నత్రజని అధిక మోతాదులో ఉండి మొక్కల ఎదుగుదలకు తోడ్పడటంతో పాటు డ్రిప్ పైప్‌లను కూడా శుభ్రపర్చగలిగి, నీటిలో కరిగిపోయే ఎరువు ఇది. ఇది తక్షణం నీటిలో కరిగిపోతుంది. తుంపర సేద్యం ద్వారా మరియు ఆకులపై పిచికారీ చేసేందుకు అనువైన ఎరువు. ఈ మేళవింపు కారణంగా పూత, పిందె అభివృద్ధి మెరుగ్గా ఉంటుంది. ఫెర్టిగేషన్* విధానానికి తోడ్పాటు అందించేందుకు నీటిలో కరిగిపోయే ఎరువులు (WSF) అభివృద్ధి చేయబడ్డాయి. ఈ విధానంలో తుంపర వ్యవస్థ ద్వారా సాగు నీటి ద్వారా ఎరువును అందిస్తారు.
కీలక ప్రయోజనాలు
అన్ని రకాల పంటలకు ప్రయోజనకరమైనది
మొక్క ఎదుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది
కొత్త శాఖలు, సూక్ష్మక్రిముల ఎదుగుదలలో ఉపయోగపడుతుంది
వేర్లు మరియు విత్తనాల అభివృద్ధిలో సహాయపడుతుంది
ఆమ్లగుణం వల్ల డ్రిప్ లైన్స్‌ను శుభ్రపర్చడంలో సహాయకరంగా ఉంటుంది
యూరియా ఫాస్ఫేట్‌ను (17:44:0) ఎలా ఉపయోగించాలి
పంట దశ, పరిమాణాన్ని బట్టి ఎరువును ఉపయోగించాలి. ఉపయోగకరమైన నత్రజని, ఫాస్ఫరస్ కోసం యూరియా ఫాస్ఫేట్ అద్భుతమైన వనరుగా ఉంటుంది. పంటలు ఎదిగేటప్పుడు ప్రాథమిక దశలో ఈ ఎరువును ఉపయోగించవచ్చు. దీన్ని తుంపర సేద్యం ద్వారా మరియు ఆకులపై పిచికారీ చేసే విధానంలోనూ వాడొచ్చు.
అలాగే, వేర్ల ట్రీట్‌మెంట్ కోసం కూడా ఉపయోగించవచ్చు. వేర్ల ట్రీట్‌మెంట్ కోసం వాడేటప్పుడు లీటరు నీటికి 10 గ్రాముల ఎరువును కలపాలి.
తుంపర సేద్యం విధానంలోనైతే పంట, నేల రకాన్ని బట్టి లీటరు నీటికి 1.5-2.5 గ్రాముల ఎరువును కలిపి ఉపయోగించవచ్చు.
అదే ఆకులపై పిచికారీ చేసే విధానంలోనైతే లీటరు నీటిలో వాటర్ సాల్యుబుల్ యూరియా ఫాస్ఫేట్ (17-44-0)ను 0.5 నుంచి 1.0% గ్రాము కలపాలి. పంట వేసిన 30-40 రోజుల తర్వాత పిచికారీ చేయాలి.