


ఎస్.ఒ.పి. (18:18:18 మరియు 6.1% S)తో యూరియా ఫాస్ఫేట్
ఇది 6% సల్ఫర్ కలిగి ఉండి, నీటిలో కరిగిపోయే NPK ఎరువు. ఇది నీటిలో తక్షణమే కరిగిపోతుంది. వేర్లు దీన్ని సులభంగా గ్రహించుకుని, మొక్కలకు అవసరమైన పోషకాలను అందించగలవు. ఫెర్టిగేషన్* విధానానికి తోడ్పాటు అందించేందుకు నీటిలో కరిగిపోయే ఎరువులు (WSF) అభివృద్ధి చేయబడ్డాయి. ఈ విధానంలో తుంపర వ్యవస్థ ద్వారా సాగు నీటి ద్వారా ఎరువును అందిస్తారు.
ముఖ్యమైన ప్రయోజనాలు
పంటల వేగవంతమైన ఎదుగుదలకు, పచ్చని దిగుబడికి సహాయపడుతుంది
కొత్త శాఖలు ఏర్పడేందుకు మరియు విత్తనాలు వేగంగా మొలకెత్తడంలో సహాయపడుతుంది
వేర్ల అభివృద్ధికి దోహదపడుతుంది
పంటలు సకాలంలో చేతికి రావడంలో సహాయపడుతుంది
మొక్కల్లో నిరోధక శక్తి పెంచుతుంది
అత్యంత నాణ్యమైన దిగుబడులు సాధించడంలో సహాయకరంగా ఉంటుంది
S.O.P. (18:18:18 and 6.1% S) గల యూరియా ఫాస్ఫేట్‌ను ఎలా ఉపయోగించాలి
పంట దశ, పరిమాణాన్ని బట్టి ఎరువును ఉపయోగించాలి. పంట ప్రాథమిక దశ నుంచి పూత పూసే ముందు దశ వరకూ ఈ ఎరువును ఉపయోగించవచ్చు. తుంపర సేద్యం లేదా ఆకులపై పిచికారీ చేసే విధానంలో దీన్ని వాడొచ్చు.
తుంపర సేద్యం విధానంలో పంట మరియు నేల రకాన్ని బట్టి లీటరు నీటికి 1.5 నుంచి 2 గ్రాముల NPKని కలిపి వాడాలి.
ఆకులపై పిచికారీ చేసే విధానంలో పంట నాటిన 30-40 రోజుల తర్వాత పూత రావడానికి ముందు దశ వరకూ, 10-15 రోజుల వ్యత్యాసంతో 2-3 సార్లు దీన్ని వాడొచ్చు. లీటరు నీటిలో N.P.K. (18:18:18)ని 0.5-1.5% నిష్పత్తిలో కలిపి ఉపయోగించాలి.