
రైతుల అభివృద్ధి కార్యక్రమం
గ్రామాల దత్తతు కార్యక్రమం
అవగాహన కల్పించడం మరియు విద్యాబోధన ప్రధాన లక్ష్యాలుగా నిర్దిష్ట ప్రాంతాల్లో టూ-ప్లాట్ ప్రదర్శన విధానం ద్వారా ఇఫ్కో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. వీటిని ఆ తర్వాత మొత్తం గ్రామానికి విస్తరించింది; గ్రామాన్ని దత్తతు తీసుకునే విధానానికి ఇది బీజం వేసింది. ఆ వెంటనే, 10 గ్రామాలను దత్తతు తీసుకోవాలనే నిర్ణయం తీసుకోబడింది.
కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి, 2,300 పైగా గ్రామాలను ఆకాంక్ష మరియు శ్రేయస్సుకు సంకేతాలుగా తీర్చిదిద్దడంలో ఇఫ్కో సహాయపడింది.
ఎరువుల వినియోగంలో సమతూకం పాటించడం, నాణ్యమైన విత్తనాలు మరియు శాస్త్రీయ సాగు నిర్వహణతో వ్యవసాయంలో దిగుబడులను మెరుగుపర్చడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చే లక్ష్యంతో గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమం ప్రారంభించబడింది. సామాజిక, ప్రమోషనల్ మరియు కమ్యూనిటీని కేంద్రంగా చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య మరియు వెటర్నరీ చెకప్ ప్రచారాలు, నేల టెస్టింగ్, అనుకూలీకరించిన వ్యవసాయ సలహాలు, మరియు గ్రామీణ మహిళలకు శిక్షణా కార్యక్రమాల ద్వారా కార్యకలాపాలను కుటుంబాలు మరియు పాడిపశువులకు కూడా విస్తరించడం జరిగింది. దత్తత తీసుకున్న342 పైచిలుకు గ్రామాల్లో 2018-19 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రమోషనల్, సామాజిక, కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య మరియు వెటర్నరీ చెకప్ క్యాంపులు, గ్రామీణ మహిళలకు శిక్షణ కార్యక్రమాలు మొదలైనవి నిర్వహించబడ్డాయి.