


జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ 33%
మొక్కల్లోని ప్రొటీన్ల సంశ్లేషణకు అవసరమయ్యే ఎంజైమ్‌లను సక్రియాత్మకంగా చేసేందుకు ఉత్ప్రేరకంగా పనిచేసే ముఖ్య సూక్ష్మపోషకాల్లో జింక్ కూడా ఒకటి. IFFCO జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ (Zn 33%, S- 15%) పంటల్లో జింక్ లోపాన్ని నిరోధిస్తుంది, సరిచేస్తుంది.
ముఖ్య ప్రయోజనాలు
పంటలను పచ్చగా ఉంచుతుంది
పంటల్లో జింకు లోపాలను సరిచేస్తుంది
మొక్కల్లో కాండం ఎదుగుదలను మెరుగుపరుస్తుంది
పంటలు, ముఖ్యంగా నూనెగింజల పంటల దిగుబడులను పెంచుతుంది
ఎంజైమ్‌లు మరియు మొక్కల్లో ప్రొటీన్లు ఏర్పడేందుకు కీలకం
వేర్లలో నత్రజనిని స్థిరీకరించేందుకు సహాయకరమైనది
జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ 33% ఎలా ఉపయోగించాలి
ప్రాంతం, పరిమాణం, పంట దశను బట్టి ఎరువులను ఉపయోగించాలి.
నాట్ల సమయంలోనూ మరియు మొక్క నిలబడినప్పుడు జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్‌ను వేయొచ్చు. ఎకరాకు 2-3 కేజీల చొప్పున, నాట్లు వేసేటప్పుడు ఎరువును నేరుగా మట్టిపై నేరుగా వేయొచ్చు. అలాగే అవసరమైతే మొక్క నిలబడినప్పుడు 40-45 రోజుల మధ్య (ధాన్యాల పంటలకైతే 25-30 రోజులు) అదే మోతాదులో మళ్లీ వేయొచ్చు.
ఆకులపై పిచికారీ చేసే విధానంలోనైతే లీటరు నీటికి 2-3 గ్రాముల జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ + 2.5 గ్రాముల సున్నం లేదా 10 గ్రాముల యూరియా సరిగ్గా కలిపి, మొక్కల ఎదుగుదల మొదలైన తొలి లేదా రెండో వారంలో ఆకులపై నేరుగా పిచికారీ చేయాలి.