


అజోస్పిరిల్లమ్
ఇది జీవఎరువు, ఇందులో సహజీవం కానీ అజోటోబాక్టిరియా ఉంటుంది. దీనికి గాలిలోని నత్రజని స్థిరీకరించే సామర్ద్యం ఉంది. కాయ ధాన్యాలు కాని పంటలకు అంటే వరి, గోధమ, తృణధాన్యాలు, పత్తి, క్యాబేజీ, టమోటా ఆవాలు, కుసుమ పువ్వు, పొద్దుతిరుగుడు మొదలైన పంటలకు దీనిని వాడమని సూచిస్తారు. ఇది మట్టిలోని జీవజాలాన్ని ఉత్తేజం చేస్తుంది. అది మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. నేలలో సేంద్రియ పదార్ధం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది.
సాంకేతిక వివరాలు
ఇఫ్కో అజోస్పిరిల్లమ్ వివరాలు
100% | అజోస్పిరిల్లమ్ బాక్టిరియా |
ముఖ్యమైన లక్షణాలు
- ఇందులో అజోస్పిరిల్లమ్బాక్టిరియల్ జీవ పదార్ధం ఉంటుంది.
- పర్యావరణానికి మేలు చేస్తుంది
- వాతావరణంలో నైట్రోజన్ ను స్థిరీకరిస్తుంది
- మొక్క ఎదుగుదలకు తోడ్పడుతుంది
- హెక్టార్ కి 60 నుంచి 80 కిలోల యూరియాను ఆదా చేస్తుంది.
లాభాలు
- ఖరీఫ్, రబీలో సాగుచేసే అన్ని పంటలకు ఉపయోగకరం. నూనెగింజలు, కూరగాయలు, పండ్ల తోటలకు కూడా పనిచేస్తుంది.
- భూసారాన్ని పెంచుతుంది.
- దిగుబడి పెంచుతుంది.


ఎరువులు వేసేటప్పుడు ఎంతెంత దూరంలో వేయాలి, ఏ నిష్పత్తిలో వేయాలి, పంట ఏ దశలో ఉన్నప్పుడు వేయాలన్న అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. జీవ ఎరువుల్ని విత్తనశుద్ది ద్వారా, నేలశుద్ది ద్వారా లేదా బిందుసేద్యం ద్వారా ఉపయోగించవచ్చు.


విత్తన శుద్ధి : నైట్రోజన్ ఉన్న జీవ ఎరువును తీసుకుని నీటిలో కలపాలి. విత్తనాలను 20 నిమిషాల పాటు ఆ ద్రావణంలో నానబెట్టాలి. ఆ తర్వాత వీలైనంత తొందరగా వాటిని నాటుకోవాలి.
