


ద్రవరూప కన్సార్టియా (ఎన్.పి.కె)
రైజోబియం, అజిటోబాక్టర్, ఎసిటోబాక్టర్, పోస్పో బాక్టిరియా – సుడోమోనాస్, పొటాషియం ద్రావణం, బాసిల్లస్ బాక్టిరియా, వాతారణంలోని నత్రజని, పాస్పరస్ ఫిక్సింగ్ ఆర్గానిజం వీటన్నింటి ఏకీకృత రూపం ఈ జీవ ఎరువు. ఎన్.పి.కె కన్సార్టియాలో నత్రజని, భాస్వరం, పొటాషియం అత్యధిక సామర్ధ్యం కలిగి ఉంటాయి. వాతావణంలో నత్రజనిని ను మొక్కకు అందిస్తుంది.
సాంకేతిక వివరాలు
ఇఫ్కో వారి ఎన్.పి.కె. కన్సార్టియా
- | రైజోబియం బాక్టిరియా |
- | అజటోబాక్టర్ బాక్టిరియా |
- | ఎసిటోబాక్టర్ బాక్టిరియా |
- | పోస్పో బాక్టిరియా -సుడోమోనస్ |
- | పొటాషియం ద్రావణం -బాసిల్లస్ |
ముఖ్య లక్షణాలు
- ఇందులో రైజోబియం, అజిటోబాక్టర్, ఎసిటోబాక్టర్, పోస్పో బాక్టిరియా – సుడోమోనాస్, పొటాషియం ద్రావణం-బాసిల్లస్ బాక్టిరియల్ కల్చర్ ఉంటాయి
- పర్యావణానికి మేలు చేస్తుంది
- నత్రజని, భాస్వరం లను స్థిరీకరిస్తుంది
- అన్ని పంటలకు ఉపయోగకరం
లాభాలు
- ఇందులో రైజోబియం, అజిటోబాక్టర్, ఎసిటోబాక్టర్, పోస్పో బాక్టిరియా – సుడోమోనాస్, పొటాషియం ద్రావణం-బాసిల్లస్ బాక్టిరియల్ కల్చర్ ఉంటాయి
- పర్యావణానికి మేలు చేస్తుంది
- అన్ని పంటలకు ఉపయోగకరం


ఎరువులు వేసేటప్పుడు ప్రాంతం, పంట విస్తీర్ణం, పంట ఏ దశలో ఉంది అన్న అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. జీవ ఎరువుల్ని విత్తనశుద్ది ద్వారా, నేలశుద్ది ద్వారా లేదా బిందుసేద్యం ద్వారా ఉపయోగించవచ్చు


విత్తన శుద్ధి : ఎన్ పి కె కన్సార్టియా జీవ ఎరువును నీటిలో కలపాలి. నాటడానికి సిద్ధం చేసుకున్న విత్తనాల్ని 20 నిమిషాల పాటు ఆ నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత వీలైనంత తొందరగా వాటిని నాటుకోవాలి.
