


పొటాషియం మొబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (KMB)
కరిగిపోని సమ్మేళనాల్లోని అకార్బనిక పొటాషియంను కరిగించి, మొక్కలకు అందించగలిగే బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ జీవ ఎరువుల్లో ఉంటుంది. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా పొటాషియంను సాల్యుబిలైజ్ చేసే బ్యాక్టీరియా లేదా పొటాషియంను కరిగించే బ్యాక్టీరియాగా కూడా వ్యవహరిస్తారు.
సాంకేతిక వివరాలు
IFFCO పొటాషియం మొబిలైజింగ్ బయో ఫెర్టిలైజర్ల వివరాలు
- | పొటాషియం ద్రావకం-బేసిల్స్ |
ప్రత్యేక లక్షణాలు
- పొటాషియంను సాల్యుబిలైజ్ చేసే బ్యాక్టీరియా లేదా పొటాషియంను కరిగింపచేసే బ్యాక్టీరియా ఉంటుంది
- పర్యావరణానికి మేలు చేస్తుంది
- పొటాషియం లభ్యతను పెంచుతుంది
- అన్ని పంటలకు ఉపయోగకరం
- అకార్బనిక పొటాషియంను మొక్కలు తీసుకునేందుకు అనువుగా సేంద్రియ స్థితికి మారుస్తుంది
ప్రయోజనాలు
- అన్ని పంటలు, అన్ని రకాల నేలల్లోనూ ఉపయోగకరం
- నేల సారాన్ని మెరుగుపరుస్తుంది
- పంట దిగుబడిని పెంచుతుంది


పండించే ప్రదేశం, నిష్పత్తి, పంట దిగుబడికి వచ్చే సమయం ప్రాతిపదికన ఎరువులను వాడాలి. విత్తనాల ట్రీట్‌మెంట్, నేల ట్రీట్‌మెంట్, లేదా తుంపర సేద్యం ద్వారా జీవ ఎరువులను ఉపయోగించవచ్చు.


విత్తన ట్రీట్‌మెంట్: పొటాషియంను సమీకరించే జీవ ఎరువును నీటిలో కలిపి, మొలకలను ద్రావకంలో సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ట్రీట్ చేసిన మొలకలను సాధ్యమైనంత త్వరగా నాటేయాలి
