


రైజోబియం
ఇది సింబయోటిక్ రైజోబియం బ్యాక్టీరియా గల జీవఎరువు. నత్రజని లోపాలను సరిచేయడంలో ఈ బ్యాక్టీరియా ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. వాతావరణంలో నత్రజనిని మెరుగుపర్చి, మొక్కలకు అందించగలిగే సామర్థ్యాలు వీటికి ఉంటాయి. వేరుశనగ, సోయాబీన్, కందులు, పెసలు, మినుములు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, సెనగలు, మేతకు ఉపయోగించే కాయధాన్యాలు మొదలైన పంటలకు దీన్ని వాడవచ్చు.
సాంకేతిక వివరాలు
IFFCO రైజోబియం వివరాలు
100% | రైజోబియం బ్యాక్టీరియా |
ప్రత్యేక లక్షణాలు
- రైజోబియం బ్యాక్టీరియా కల్చర్ ఉంటుంది
- పర్యావరణానికి మేలుచేస్తుంది
- నత్రజనిని స్థిరీకరిస్తుంది
- పలు రకాల పంట వ్యాధులను నిరోధించే క్రిమిసంహాకరాలను ఉత్పత్తి చేయగలదు
- హెక్టారుకు 60 నుంచి 80 కేజీల వరకూ యూరియాను ఆదా చేస్తుంది
కీలక ప్రయోజనాలు
- సెనగలు, మినుములు, ఎర్రని కాయధాన్యాలు, బఠానీ, సోయాబీన్, వేరుశనగ, బర్సీమ్ వంటి కాయధాన్యాల పంటలకు ఉపయోగించవచ్చు
- నేల సారాన్ని మెరుగుపరుస్తుంది
- పంట దిగుబడిని పెంచుతుంది


పండించే ప్రదేశం, పరిమాణం, పంట దశ ప్రాతిపదికన ఎరువులను వాడాలి. విత్తనాల ట్రీట్‌మెంట్ విధానంలో రైజోబియంను ఉపయోగించవచ్చు.


విత్తన ట్రీట్‌మెంట్: నత్రజనియుక్త జీవఎరువును నీటిలో కలపాలి. ఆ తర్వాత విత్తనాలను ద్రావకంలో ముంచాలి. 1 ఎకరానికి సరిపడే విత్తనాల ట్రీట్‌మెంట్ కోసం 250 మి.లీ. ఉపయోగించవచ్చు. ట్రీట్ చేసిన విత్తనాలను సాధ్యమైనంత త్వరగా నాటాలి. పంట స్వభావాన్ని బట్టి వివిధ రకాల రైజోబియంను ఉపయోగించండి.
