,
Loader..
BEWARE OF FRAUDSTERS: WE HAVE NOT INVITED ANY REQUESTS FOR DEALERSHIP/FRANCHISE. DO NOT TRUST ANYONE OFFERING SUCH A FACILITY AND SEEKING MONEY IN IFFCO’S NAME.
Start Talking
Listening voice...
Zinc Solubalazing Bacteria
Zinc Solubalazing Bacteria

జింక్‌ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా

ఎదుగుదలకు అవసరమయ్యే హార్మోన్ల ఉత్పత్తి, మరియు కణుపుల మధ్య భాగం సాగడం వంటి మొక్క అనేక అభివృద్ధి ప్రక్రియలకు కీలకమైన సూక్ష్మ పోషకాల్లో జింక్ కూడా ఒకటి. జింక్ సొల్యూషన్ బయో ఫర్టిలైజర్స్ (Z.S.B)లో అసేంద్రియ జింక్‌ను కరిగించి, మొక్క వినియోగానికి అనువుగా అందించే సామర్థ్యాలు గల బ్యాక్టీరియా ఉంటుంది. నేలలో సింథటిక్ జింకు ఎరువులను అధికంగా వాడే అవసరాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

సాంకేతిక వివరాలు

జింక్ సొల్యూషన్ బయో ఫర్టిలైజర్స్ (Z.S.B.) వివరాలు

- జింక్‌ను కరిగించే బ్యాక్టీరియా

ముఖ్యమైన లక్షణాలు

  • జింక్‌ను కరిగించే బ్యాక్టీరియా కలిగి ఉంటుంది.
  • పర్యావరణానికి మేలు చేస్తుంది
  • జింక్ లభ్యతను పెంచుతుంది
  • అన్ని పంటలూ, నేలలకు ఉపయోగకరం
  • కరగని జింక్‌ను మొక్కలు గ్రహించేందుకు వీలుగా సేంద్రియ రూపంలోకి మారుస్తుంది.

ప్రయోజనాలు

  • పప్పుధాన్యాలు సహా అన్ని పంటలకు ఉపయోగకరం
  • నేల సారాన్ని మెరుగుపరుస్తుంది
  • పంట దిగుబడిని పెంచుతుంది
Zinc
icon1
icon2
icon3
13img
పంటలకు వర్తింపచేసే తీరు

పండించే ప్రదేశం, పరిమాణం, పంట దశ ప్రాతిపదికన ఎరువులను వాడాలి. విత్తనాల ట్రీట్‌మెంట్, నేల ట్రీట్‌మెంట్, లేదా తుంపర సేద్యం ద్వారా జీవ ఎరువులను ఉపయోగించవచ్చు.

cropimg
14img
వేసే విధానాలు

విత్తన ట్రీట్‌మెంట్: జింక్ సొల్యూషన్ బయో ఫర్టిలైజర్స్‌ను (Z.S.B.) నీటిలో కలిపి, మొలకలను ద్రావకంలో సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ట్రీట్ చేసిన మొలకలను సాధ్యమైనంత త్వరగా నాటేయాలి

cropimg

ఫాస్ఫేట్ సాల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా
ఫాస్ఫేట్ సాల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా

కరిగిపోయే గుణం ఉండని సమ్మేళనాల్లోని అకార్బనిక ఫాస్ఫరస్‌ను కరిగించి, మొక్కలకు అందించగలిగే సామర్థ్యాలు గల బ్యాక్టీరియా, ఫాస్ఫరస్ ద్రావక జీవ ఎరువుల్లో ఉంటుంది. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా ఫాస్ఫరస్‌ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా లేదా ఫాస్ఫరస్‌ను కరిగించే బ్యాక్టీరియా అంటారు. సింథటిక్ ఫాస్ఫేట్ ఎరువుల అవసరాన్ని ఫాస్ఫరస్ ద్రావక జీవ ఎరువు తగ్గిస్తుంది.

మరింత తెలుసుకోండి
అజొటోబాక్టర్
అజొటోబాక్టర్

ఇది జీవఎరువు, ఇందులో సహజీవం కానీ అజోటోబాక్టిరియా ఉంటుంది. దీనికి గాలిలోని నత్రజని స్థిరీకరించే సామర్ద్యం ఉంది. కాయ ధాన్యాలు కాని పంటలకు అంటే వరి, గోధమ, తృణధాన్యాలు, పత్తి, క్యాబేజీ, టమోటా ఆవాలు, కుసుమ పువ్వు, పొద్దుతిరుగుడు మొదలైన పంటలకు దీనిని వాడమని సూచిస్తారు. ఇది మట్టిలోని జీవజాలాన్ని ఉత్తేజం చేస్తుంది. అది మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. నేలలో సేంద్రియ పదార్ధం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది.

మరింత తెలుసుకోండి
అజోస్పిరిల్లమ్
అజోస్పిరిల్లమ్

ఇది అజోస్పిరిల్లమ్ బాక్టిరియాను కలిగిన జీవ ఎరువు. ఈ బాక్టిరియా మొక్క వేళ్ల దగ్గర ఆవాసం ఏర్పర్చుకుని వాతావరణంలో నత్రజనిని స్థిరపరుస్తుంది. ఇది ఫైటో హార్మోన్లను స్థిరీకరిస్తుంది. ప్రత్యేకించి ఇండోల్ 3 ఎసిటిక్ యాసిడ్ ను స్థిరీకరిస్తుంది. దీంతో నిర్జీవ, జీవ ఒత్తి తట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది. ఇది మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది.

మరింత తెలుసుకోండి
రైజోబియం
రైజోబియం

ఇది సింబయోటిక్ రైజోబియం బ్యాక్టీరియా గల జీవఎరువు. నత్రజని లోపాలను సరిచేయడంలో ఈ బ్యాక్టీరియా ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. వాతావరణంలో నత్రజనిని మెరుగుపర్చి, మొక్కలకు అందించగలిగే సామర్థ్యాలు వీటికి ఉంటాయి. వేరుశనగ, సోయాబీన్, కందులు, పెసలు, మినుములు, కాయధాన్యాలు, చిక్కుళ్లు, సెనగలు, మేతకు ఉపయోగించే కాయధాన్యాలు మొదలైన పంటలకు దీన్ని వాడవచ్చు.

మరింత తెలుసుకోండి
ద్రవరూప కన్సార్టియా (ఎన్.పి.కె)
ద్రవరూప కన్సార్టియా (ఎన్.పి.కె)

రైజోబియం, అజిటోబాక్టర్, ఎసిటోబాక్టర్, పోస్పో బాక్టిరియా – సుడోమోనాస్, పొటాషియం ద్రావణం, బాసిల్లస్ బాక్టిరియా, వాతారణంలోని నత్రజని, పాస్పరస్ ఫిక్సింగ్ ఆర్గానిజం వీటన్నింటి ఏకీకృత రూపం ఈ జీవ ఎరువు. ఎన్.పి.కె కన్సార్టియాలో నత్రజని, భాస్వరం, పొటాషియం అత్యధిక సామర్ధ్యం కలిగి ఉంటాయి. వాతావణంలో నత్రజనిని ను మొక్కకు అందిస్తుంది.

మరింత తెలుసుకోండి
ఎసిటోబాక్టర్
ఎసిటోబాక్టర్

ఇది జీవఎరువు, ఇందులో ఎసిటోబాక్టర్ అనే బాక్టిరియా ఉంటుంది. ఇది మొక్కల వేళ్ల దగ్గర ఆవాసం ఏర్పర్చుకుని, గాలిలోని నత్రజని గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ చెరకు పంటకు ఎంతో కీలకమైంది. ఇది మట్టిలోని జీవజాలాన్ని ఉత్తేజం చేస్తుంది. అది మొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.

మరింత తెలుసుకోండి
పొటాషియం మొబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (KMB)
పొటాషియం మొబిలైజింగ్ బయోఫెర్టిలైజర్ (KMB)

కరిగిపోని సమ్మేళనాల్లోని అకార్బనిక పొటాషియంను కరిగించి, మొక్కలకు అందించగలిగే బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ జీవ ఎరువుల్లో ఉంటుంది. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా పొటాషియంను సాల్యుబిలైజ్ చేసే బ్యాక్టీరియా లేదా పొటాషియంను కరిగించే బ్యాక్టీరియాగా కూడా వ్యవహరిస్తారు.

మరింత తెలుసుకోండి
మొక్కల ఎదుగుదలకు దోహదకారి – సాగరిక లిక్విడ్
మొక్కల ఎదుగుదలకు దోహదకారి – సాగరిక లిక్విడ్

సాగరిక – సీవీడ్ ఎక్స్‌ట్రాక్ట్ కాన్సెంట్రేట్ (28% w/w) అనేది ఒక సేంద్రియ బయో-స్టిమ్యులెంట్. అంతర్జాతీయంగా పేటెంటు పొందిన టెక్నాలజీతో ఇది ఎరుపు మరియు గోధుమ రంగులోని సముద్రపు నాచు నుండి తయారుచేయబడుతుంది. మొక్క ఎదుగుదలకు దోహదపడే సహజసిద్ధమైన ఆక్సిన్లు, సైటోకినిన్లు ఇంకా గిబ్బరెలిన్లు, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, స్థూల & సూక్ష్మ పోషకాలు మొదలైనవి ఈ ఉత్పత్తిలో ఉంటాయి. అలాగే, గ్లైసీన్, బెటెయిన్, కోలీన్ వంటి క్వాటర్నరీ అమోనియం సమ్మేళనాలతో (QAC) పాటు బయో-పొటాష్ (8-10%) కూడా ఉంటుంది.
IFFCO సాగరిక లిక్విడ్ గురించి మరింత తెలుసుకునేందుకు దయచేసి ఉత్పత్తి వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరింత తెలుసుకోండి
మొక్కల ఎదుగుదలకు దోహదకారి – సాగరిక గ్రాన్యులర్
మొక్కల ఎదుగుదలకు దోహదకారి – సాగరిక గ్రాన్యులర్

సాగరిక జెడ్++ అనేది వ్యవసాయంలోఉపయోగించేందుకు ఎరుపు మరియు గోధుమ రంగులో ఉండే సముద్ర నాచుతో బలవర్ధకంగా తీర్చిదిద్దిన గుళికలు. భారతీయ తీరప్రాంతాల్లో ఈ సముద్ర నాచు
IFFCO సాగరిక గ్రాన్యులర్ గురించి మరింత తెలుసుకునేందుకు దయచేసి ఉత్పత్తి వెబ్‌సైట్‌ను సందర్శించండి

మరింత తెలుసుకోండి