


ఎన్ పి(ఎస్) 20-20-0-13
-
ఇఫ్కో తయారు చేస్తున్న ఎన్ పి గ్రేడ్ 20-20-0-13, అమ్మోనియం పాస్పేట్ సల్ఫేట్ ఎరువు. రెండు సూక్ష్మ పోషకాలు( నైట్రోజన్, పాస్పరస్) లతో పాటుగా ఇది సల్ఫర్ ను కూడా అందిస్తుంది. మొక్కల ఎదుగుదలకు ఇది అత్యంత కీలకమైన పోషకం, క్లోరోఫిల్ సింథసిస్ కి కూడా సహాయపడుతుంది. ఈ ఎన్ పి(ఎస్) 20-20-13 ను నేలకు అవసరమైన పోషకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కాస్త తక్కువ పాస్పరస్, అధిక పొటాషియం, తక్కువ సల్ఫర్ ఉన్న నేలలకు ఇది బాగా ఉపయోగకరం.
లాభాలు
మొక్కల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది
మొక్కలకు తగినంత నైట్రోజన్ అందేలా చూస్తుంది
ధాన్యాలు, నూనె గింజల్లో ప్రొటిన్ పరిమాణం పెంచుతుంది
పెద్ద మొత్తంలో పోషకాలు అందిస్తుంది

ఎన్ పి(ఎస్) 20-20-0-13 ఉపయోగించడం ఎలా
ఎన్ పి(ఎస్) 20-20-0-13 నేల మీద చల్లేటప్పుడు ప్రాంతం, పంట విస్తీర్ణం, పంట దశ ను పరిగణలోకి తీసుకోవాలి.
విత్తనాలు విత్తేటప్పుడు దీనిని కూడా చేతితో చల్లుకోవాలి. పంట, నేల స్వభావం( ఆ రాష్ట్రానికి ఇచ్చిన సాధారణ సూచనలు)బట్టి తగు మోతాదులో వాడుకోవాలి. ఎన్ పి(ఎస్) 20-20-0-13 ని ఎదిగిన పంటకు చల్లకూడదు. ఎన్ పి(ఎస్) 20-20-0-13ని విత్తనాలతో కలిపి చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది.