


నీమ్ కోటెడ్ యూరియా (ఎన్)
-
యూరియా నత్రజనికి మూలం, అది కీలకమైన పోషకం. పంట ఎదుగుదలకు, అభివృద్ధికి అది చాలా ముఖ్యం. మనదేశంలో అంత్య కీలకమైన నత్రజని ఎరువు యూరియా. ఎందుకంటే ఇందులో అత్యధికంగా నైట్రోజన్(46% ఎన్) ఉంటుంది. దీనిని పారిశ్రామిక అవసరాల్లో అంటే ప్లాస్టిక్ మరియు, పోషకాలతో కూడిన పశువుల దాణా తయారీ లో వాడతారు.
నీమ్ కోటెడ్ యూరియా(ఎన్) అనేది వేప నూనె పూత కలిగిన యూరియా. ప్రత్యేకంగా వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే తయారు చేశారు. వేప నూనె పూత వల్ల యూరియా నైట్రిఫికేషన్ నెమ్మదిస్తుంది. నేలలోని పోషకాల్ని పెద్ద మొత్తంలో గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. అదే సమయంలో భూగర్భ జలాలు కలుషితం కాకుండా కాపాడుతుంది
ముఖ్య ప్రయోజనాలు
మొక్కల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది
మొక్కలకు తగినంత మొత్తంలో నైట్రోజన్ అందేలా చూస్తుంది
పంట దిగుబడి పెంచుతుంది
పెద్ద మొత్తంలో పోషకాలు అందిస్తుంది

నీమ్ కోటెడ్ యూరియా (ఎన్) ను ఎలా ఉపయోగించాలి
యూరియాను నేల మీద చల్లేటప్పుడు ప్రాంతం, పంట విస్తీర్ణం, పంట దశ ను పరిగణలోకి తీసుకోవాలి.
ఒకవేళ యూరియాను ఎటుంటి మొక్కలు లేని నేల మీద చల్లుతుంటే, అస్థిరత కారణంగా ప్రభావం చూపించే స్థాయిలో అమ్మోనియా నష్టపోతాం. ఎందుకంటే అది చాలా వేగంగా జలవిశ్లేషణ చెంది అమ్మోనియం కార్బొనేట్ గా మారిపోతుంది. కాబట్టి యూరియాను విత్తనాలు నాటిన తర్వాత లేదా పంట ఎదిగిన తర్వాత వేసుకోవాలి. సూచించిన మోతాదులో సగం, విత్తనాలు వేసే సమయంలో చల్లుకోవాలి. 30 రోజుల తర్వాత మిగతా సగాన్ని రెండు, మూడు సమాన భాగాలుగా విభజించి 15 రోజులకోసారి చొప్పున చల్లుకోవాలి.
యూరియాకు త్వరగా జలవిశ్లేషణ చెందే గుణం ఉండటం వల్ల, అమ్మోనియా కారణంగా మొలకలు దెబ్బతినే అవకాశం ఉంది. పెద్దమొత్తంలో లేదా విత్తనాలకు బాగా దగ్గరగా యూరియా పడితే ఇలా జరిగే ప్రమాదం ఉంది. విత్తనాల నుంచి యూరియాను తగినంత దూరంలో జల్లుకుంటే ఈ సమస్య ఎదురుకాదు. యూరియాను పంట అవసరం, నేల పరిస్థితిని(ఆ రాష్ట్రానికి సంబంధించిన సాధారణ సూచనలు) బట్టి చల్లుకోవాలి.