


ఎన్ పికె 10-26-26
ఎన్ పికె, డిఎపి ఆధారిత మిశ్రమ ఎరువు. దీనిని కాండ్లాలోని ఇఫ్కో యూనిట్ లో తయారు చేస్తారు. అది కాకుండా ఎన్ పికె 10:26:26 తయారు చేస్తున్నారు. ఎన్ పికె 10:26:26, నేలలోని పాస్పరస్, పొటాషియం స్థాయిని సరి చేస్తుంది. పూర్తిగా ఖనిజ లవణాలు లేని నేలకు ఇది బాగా పనిచేస్తుంది. ఇవి కనికల్లా ఉంటాయి. తేమ తగలని హెడిపి సంచులో అయితే వీటిని సులభంగా నిల్వ చేయవచ్చు, రవాణాకు బాగుంటుంది.
ముఖ్యమైన లాభాలు
కీలకమైన పోషకాలు కావాల్సిన స్థాయిలో అందిస్తాయి
పంట వేగంగా ఎదిగేందుకు సహాయపడుతుంది
దిగుబడి పెంచుతుంది

ఎన్ పికె 10-26-26 ఎలా ఉపయోగించాలి
ఎన్ పికె నేల మీద చల్లేటప్పుడు ప్రాంతం, పంట విస్తీర్ణం, పంట దశ ను పరిగణలోకి తీసుకోవాలి.
విత్తనాలు విత్తేటప్పుడు దీనిని కూడా చేతితో చల్లుకోవాలి. పంట, నేల స్వభావం( ఆ రాష్ట్రానికి ఇచ్చిన సాధారణ సూచనలు)బట్టి తగు మోతాదులో వాడుకోవాలి. ఎన్ పికె 10:26:26 ని ఎదిగిన పంటకు చల్లకూడదని సూచిస్తున్నారు. ఎన్ పికె 10:26:26ని విత్తనాలతో కలిపి చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది.